ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ప్రతి పౌరుడికీ సమాన హక్కులు

ABN, Publish Date - Apr 15 , 2025 | 04:28 AM

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో అత్యుత్తమమని కొనియాడారు. కుల, మత, లింగ వివక్ష లేకుండా సమాన హక్కులు కల్పించడంలో అంబేడ్కర్‌ పాత్ర విశేషమన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: పవన్‌

అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోకెల్లా భారతదేశ రాజ్యాంగం అత్యుత్తమమైనదని.. కుల, మత, జాతి, లింగ వివక్షకు తావు లేకుండా ప్రతి పౌరుడికీ సమాన హక్కులు కల్పించేలా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఈ రాజ్యాంగాన్ని రచించారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. సోమవారం అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి అంజలి ఘటించారు. ఆర్థికాంశాల కంటే సామాజికపరమైన అంశాలే వెనకబాటుతనానికి కారణమని గ్రహించిన అంబేడ్కర్‌.. తన జీవితానుభవాలు, ఉన్నత విద్య అందించిన విజ్ఞానం, సమసమాజ స్థాపన చేయాలనే తపనతో రాజ్యాంగ రూపకల్పన చేశారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్‌ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమంతో పాటు వారి రక్షణకు ప్రాధాన్యమిస్తున్నారని గుర్తుచేశారు. కూటమి పాలనలో అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:28 AM