ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP and BRS: దోస్త్‌ మేరా దోస్త్‌

ABN, Publish Date - Jul 25 , 2025 | 03:06 AM

2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు జగన్‌కు బీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా సహకరించిందనేది బహిరంగ రహస్యం! ఇక... 2018లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంది.

  • వైసీపీ, బీఆర్‌ఎస్‌ అవినాభావ సంబంధం

  • రెండుచోట్లా దర్యాప్తుల్లో బయటపడుతున్న విషయాలు

  • జగన్‌ కోసం నాడు షర్మిల ఫోన్‌ ట్యాపింగ్‌

  • మద్యం కేసులో నిందితులకు ‘ట్యాపింగ్‌’ శ్రవణ్‌రావు ఆశ్రయం

  • తన దుబాయ్‌ ఫ్లాటులో ఆతిథ్యం

  • లిక్కర్‌ సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రాజ్‌ కసిరెడ్డి

  • లావాదేవీలకు నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు సాయం!?

రాజకీయ పార్టీలు కూటములు కట్టడం మామూలే! లోపాయికారీగా సహకరించుకోవడమూ సహజమే! కానీ... ‘పార్ట్‌నర్స్‌ ఇన్‌ క్రైమ్‌’ తరహాలో అక్రమాల్లోనూ ‘అవిభక్తం’గా కలిసి మెలిసి సాగడమే ఓ విచిత్రం! ఆ రెండు పార్టీలు... తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌, ఏపీలో జగన్‌ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ! తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్‌, ఏపీలో మద్యం స్కామ్‌పై ఒకే సమయంలో వేర్వేరుగా జరుగుతున్న దర్యాప్తుల్లో ఆ రెండు పార్టీల మధ్య లింకులు బయటపడుతుండటం విశేషం!

(అమరావతి- ఆంధ్రజ్యోతి): 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు జగన్‌కు బీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా సహకరించిందనేది బహిరంగ రహస్యం! ఇక... 2018లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంది. లోపాయికారీగా సహకారమూ అందించింది. కేసీఆర్‌ తనకు ‘పెద్దన్న’ అని జగన్‌ ఎన్నోసార్లు చెప్పకనే చెప్పారు. వారిద్దరి మధ్య రాజకీయాలకు మించిన బంధం! అదికాస్తా... అక్రమాల్లో సహకరించుకునేదాకా వెళ్లిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇప్పటికీ పరస్పర అవసరాల కోసం ఇద్దరి మధ్య సహకారం కొనసాగుతున్నట్లు చెబుతారు.

జగన్‌ కోసం షర్మిలపై నిఘా..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో వైఎస్‌ షర్మిల ఫోన్‌పైనా నిఘా పెట్టినట్లు ఇప్పటికే స్పష్టమైంది. అప్పటికే సోదరుడు జగన్‌తో షర్మిలకు ఆస్తి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు జగన్‌ కోరిక మేరకే నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ను ట్యాప్‌ చేసినట్లు భావిస్తున్నారు. ‘నాడు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినందున... ఆ వివరాలపై కూపీ లాగేందుకే ట్యాపింగ్‌ చేసి ఉండొచ్చు’ అంటున్న వైసీపీ వాదనలో ఏమాత్రం పసలేదు. షర్మిల పార్టీని కేసీఆర్‌ అసలు లెక్కలోకే తీసుకోలేదు. కాంగ్రె్‌సపైనే ఆయన గురిపెట్టారు. కొందరు మీడియా ప్రముఖులపైనా నిఘా వేశారు. వెరసి...కేవలం జగన్‌ కోసమే షర్మిల ఫోన్‌ను ట్యాప్‌ చేశారనడంలో ఏమాత్రం సందేహంలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా...ఒక చట్టవిరుద్ధచర్యలోనూ బీఆర్‌ఎస్‌, వైసీపీ చేతులు కలిపాయి.

మద్యంతో ‘ట్యాప్‌’ లింకులు..

తెలంగాణలో నమోదైన ట్యాపింగ్‌ కేసులో నిందితుడైన శ్రవణ్‌రావు బీఆర్‌ఎస్‌ పెద్దలకు సన్నిహితుడు. ట్యాపింగ్‌కు అవసరమైన సాంకేతిక పరికరాలను శ్రవణ్‌రావు కంపెనీ పేరుమీదే కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనను కూడా ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా చేర్చారు. విచిత్రమేమిటంటే... ఇదే శ్రవణ్‌రావు ఏపీలో మద్యం స్కామ్‌ నిందితులకు దుబాయ్‌లో తన ఫ్లాట్‌లో ఆశ్రయం ఇచ్చారు. నెలకు సుమారు రూ.5 లక్షల అద్దె వదులుకుని మరీ... ఫ్లాటులో ఆతిథ్యం ఇచ్చారు. శ్రవణ్‌ రావు కూడా కొన్నాళ్లు వారితో కలిసి అదే ఫ్లాటులో ఉన్నారంటే... ‘ట్యాపింగ్‌, లిక్కర్‌’ బంధం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. రాజ్‌ కసిరెడ్డి, శ్రవణ్‌రావు ఇద్దరూ సన్నిహితులని... ఈ క్రమంలోనే ఇతర నిందితులు కిరణ్‌కుమార్‌ రెడ్డి, వరుణ్‌, చాణక్య దుబాయ్‌లోని ఫ్లాటులో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ సిఫారసుచేసిన కాంట్రాక్టర్లకు ఏపీలో పనులు అప్పగించడం, ఏపీలో వైసీపీ నేతలకు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కడం... ఆ రెండు పార్టీల మధ్య ‘క్విడ్‌ప్రో కో’కు మరో ఉదాహరణ. ఒకే సమయంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న దర్యాప్తులో ఇప్పటికి ఈ సంగతులు బయటపడ్డాయి. లోతుకు వెళ్లేకొద్దీ మరెన్ని మిలాఖత్‌లు వెలుగులోకి వస్తాయో!

ఏపీ లిక్కర్‌ సొమ్ముతో తెలంగాణలో ఆస్తులు

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు దుబాయ్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తే.. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ కింగ్‌పిన్‌ రాజ్‌ కసిరెడ్డి తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. రాజ్‌ కసిరెడ్డి హైదరాబాద్‌ సమీపంలో పారిశ్రామిక కారిడార్‌లో రూ.150 కోట్లతో 90ఎకరాల భూమి, ఖరీదైన ప్రాంతంలో స్థిరాస్తి కొనుగోలు చేసినట్లు సిట్‌ గుర్తించింది. మనీరూటింగ్‌లో భాగంగా స్కాంలో సంపాదించిన మొత్తంతో భూములు కొని... అందులో కొన్ని తిరిగి విక్రయించారు. రాజ్‌ కసిరెడ్డి సంస్థల పేర్లతో ఆ భూములు ఎలా కొనుగోలు చేశారు? విక్రయంతో వచ్చిన సొమ్ము ఎక్కడికి దారిమళ్లించారు? అనే కోణంలో ‘సిట్‌’ ఆరా తీసింది. ఈ లావాదేవీలకు అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు సహకరించిందని అనుమానిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 08:58 AM