పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి
ABN, Publish Date - Jun 14 , 2025 | 12:22 AM
మండలంలోని సిమెంటునగర్ గ్రామంలో ఉన్న పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ పునఃప్రారంభించాలని కార్మి కులు డిమాండ్ చేశారు.
బేతంచెర్ల, జూన 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిమెంటునగర్ గ్రామంలో ఉన్న పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ పునఃప్రారంభించాలని కార్మి కులు డిమాండ్ చేశారు. శుక్రవారం 12వ రోజు సిమెంటునగర్ పాత బస్టాండు వద్ద గ్రామ నాయకులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, బుగ్గన బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీవితాలు నడిరోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా అన్యాయం చేసే సహించేది లేదని, అవసరమైన ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. యాజమాన్యం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు మోజెస్, రామసుబ్బయ్య, రామంజనే యులు, డీసీహెచ ఆంజనేయులు, చంద్రశేఖర్, హనీఫ్, అత్తార్‌బషా, వి.మద్దయ్య, డి.శ్రీనివాసరావు, జయకృష్ణ, రంగన్న, నాయకులు భీమేష్ రెడ్డి, బతుకన్న, ఆనందం, రాముడు, సుభాన, మస్తానవలి, వాసు, ఉరుకుందు, ఐజయ్య, బుగ్గానిపల్లె ఎల్లనాయుడు, ఇసాక్ జాకీరుల్లాభేగ్, శ్యాంసుందర్, రహింతుల్లా ఉన్నారు.
Updated Date - Jun 14 , 2025 | 12:22 AM