Palla Srinivas Rao: మహానాడు విజయవంతం కావాలని పల్లా పూజలు
ABN, Publish Date - Apr 16 , 2025 | 04:13 AM
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కడపలో నిర్వహించనున్న మహానాడు విజయవంతం కావాలని గుజరాత్‌లోని ద్వారకా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానాడు టీడీపీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు
కడపలో నిర్వహించనున్న మహానాడు టీడీపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుజరాత్‌లోని ద్వారకాలో ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ద్వారక ఆలయానికి వెళ్లిన ఆయన మహానాడు విజయవంతం కావాలని పూజలు చేశారు.
Updated Date - Apr 16 , 2025 | 04:13 AM