ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భావితరాలకు స్ఫూర్తి ఒలింపిక్‌ జ్యోతి

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:37 PM

ఒలింపిక్స్‌ ఇచ్చిన స్ఫూర్తితో భావితరాలకు క్రీడలపై చైతన్యం కల్పించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని కర్నూలు ఒలింపిక్‌ సంఘం చైర్మన, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.

ప్రారంభమైన ఒలింపిక్‌ పరుగు

మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌

నగర ప్రధాన కూడళ్లలో ప్రారంభమైన ఒలింపిక్‌ పరుగు

కర్నూలు స్పోర్ట్స్‌, జూన 23 (ఆంధ్రజ్యోతి): ఒలింపిక్స్‌ ఇచ్చిన స్ఫూర్తితో భావితరాలకు క్రీడలపై చైతన్యం కల్పించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని కర్నూలు ఒలింపిక్‌ సంఘం చైర్మన, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్‌ రన వేడుకలు నిర్వహించారు. ఓల్డ్‌టౌన వద్ద ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి అవినాష్‌ శెట్టి ఆధ్వర్యంలో పరుగును ప్రారంభించారు. రెండో కూడలి స్థానిక అవుట్‌డోర్‌ స్టేడియం నుంచి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, జిల్లా ఒలింపిక్‌ సంఘం సీఈవో విజయ్‌ కుమార్‌, నిర్వహణ కార్యదర్శి పి.సునీల్‌ కుమార్‌, జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి రుద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు. మూడో కూడలైన ఏపీఎస్‌పీ రెండో బెటాలియన డీఎస్పీ మహబూబ్‌ బాషా పరుగును ప్రారంభించారు. నాల్గవ కూడలి బిర్లాగేటు ఖానా ఖజానా నుంచి జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, పీఈటీల అధ్యక్షుడు జోసెఫ్‌ లక్ష్మయ్యలు పరుగు ప్రారంభించారు. ఐదవ కూడలి చెన్నమ్మ సర్కిల్‌ నుంచి క్రీడా సంఘాల ప్రతినిధులు వెటరన సంఘం కార్యదర్శి రవికుమార్‌, ఈశ్వర్‌ నాయుడు ఆధ్వర్యంలో పరుగు ప్రారంభించారు. ఈ ఐదు కూడళ్ల నుంచి ప్రారంభమైన పరుగు రాజ్‌విహార్‌కు చేరుకుని అక్కడ సమూహంగా ఏర్పడి ‘ఒలింపిక్‌ క్రీడా జ్యోతుల’తో అతిథులు స్థానిక అవుట్‌డోర్‌ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రీడా చైతన్యం నింపేందుకు గత 15 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో రాజకీయాలకు అతీతంగా ఒలింపిక్‌ పరుగును నిర్వహిస్తున్నామన్నారు. క్రీడలకు కర్నూలు పెట్టింది పేరు అన్నారు. డీఈఓ శామ్యూల్‌ పాల్‌ మాట్లాడుతూ క్రీడాకారులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అంతర్‌ పాఠశాలల పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన శమంతకమణి, మానవతా సంస్థ అధ్యక్షులు దీప్తి, కన్వీనర్‌ యానీ ప్రతాప్‌, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు హరినాథ్‌ చౌదరి బాక్సింగ్‌ అధ్యక్షుడు గంగాధర్‌గౌడు, స్కేటింగ్‌ అధ్యక్షులు సుధాకర్‌గౌడు, ఉషూ శ్రీనివాసులు, పీఈటీలు సత్య, లోకేశ, శ్యామ్‌, జిల్లా తైక్వాండో సభ్యులు వీరేష్‌బాబు, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:37 PM