ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్మశానం స్థలం కబ్జా!

ABN, Publish Date - Aug 03 , 2025 | 01:27 AM

పెడన మండలం జింజేరు పరిధిలోని గౌడపాలెంలో అక్రమార్కులు బరి తెగించారు. పది మందికి ఉపయోగపడే శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. మూడు ఎకరాల్లో ఏకంగా రొయ్య చెరువు తవ్వేశారు. దాని పక్కనే ఉన్న పీడబ్ల్యూడీ భూములు మరో మూడు ఎకరాలను ఆక్రమించేశారు. ఇక్కడ చెరువును తవ్వి రొయ్యల సాగు ఆరంభించారు. మిగిలిన శ్మశాన వాటిక స్థలంపైన కన్నేశారు. ఇదేంటని ప్రశ్నించిన గ్రామస్థులపై బెదిరింపులకు దిగుతున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- మూడు ఎకరాలు ఆక్రమించి చెరువు తవ్వకం

- పెడన మండలం జింజేరు శివారు గౌడపాలెంలో అక్రమార్కుల దుశ్చర్య

- మరో మూడు ఎకరాలు పీడబ్ల్యూడీ భూములు కూడా కబ్జా

- మడ చెట్లను నరికి.. చెరువు తవ్వి యథేచ్ఛగా రొయ్యల సాగు

- ప్రశ్నించిన గ్రామస్థులకు బెదిరింపులు

- మిగిలిన శ్మశాన స్థలంపైనా అక్రమార్కుల కన్ను

- వీరికి రెవెన్యూ అధికారుల అండ!

పెడన మండలం జింజేరు పరిధిలోని గౌడపాలెంలో అక్రమార్కులు బరి తెగించారు. పది మందికి ఉపయోగపడే శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. మూడు ఎకరాల్లో ఏకంగా రొయ్య చెరువు తవ్వేశారు. దాని పక్కనే ఉన్న పీడబ్ల్యూడీ భూములు మరో మూడు ఎకరాలను ఆక్రమించేశారు. ఇక్కడ చెరువును తవ్వి రొయ్యల సాగు ఆరంభించారు. మిగిలిన శ్మశాన వాటిక స్థలంపైన కన్నేశారు. ఇదేంటని ప్రశ్నించిన గ్రామస్థులపై బెదిరింపులకు దిగుతున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం):

పెడన మండలం జింజేరు గ్రామ పరిధిలోని గౌడపాలెంలో హిందూ శ్మశాన వాటికకు ఏడు ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లో 30 సెంట్ల విస్తీర్ణంలో శ్మశానం ఉంది. ఈ శ్మశాన భూములను ఆనుకుని పీడబ్ల్యూడీ భూములు కూడా ఉన్నాయి. జింజేరులో లజ్జబండ డ్రెయిన్‌ వెంబడి ఈ పీడబ్ల్యూడీ భూములు ఉన్నాయి. వీటిని ఇప్పటికే చాలా వరకు అక్రమార్కులు ఆక్రమించేశారు. మడ చెట్లు కలిగిన భూములను కూడా అక్రమార్కులు చెరపట్టారు. మడచెట్లను నరికివేస్తూ ఆ భూముల్లో రొయ్యల చెరువులను తవ్వారు. ఇలా జింజేరులో 200 ఎకరాల మేర మడ చెట్లు కలిగిన పీడబ్యూడీ భూములలో 125 ఎకరాల మేర నరికేసి రొయ్యల చెరువులు సాగు చేశారు. రొయ్యల సాగు ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తుండటంతో అక్రమార్కులు ఈ ప్రాంతంలో కనిపించే ఏ భూములను కూడా వదలటం లేదు. ఈ క్రమంలోనే గౌడపేటలోని సర్వే నెంబర్‌ 5-10లోని హిందూ శ్మశాన స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. హిందూ శ్మశాన స్థలానికి మొత్తం ఏడు ఎకరాలు భూములున్నా వాటిని రక్షించుకోవటానికి కంచె వంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. దీనిని అదనుగా చేసుకుని శ్మశాన స్థలంలో మూడు ఎకరాల భూములను, ఈ భూములకు అభిముఖంగా ఉన్న పీడబ్ల్యూడీ భూముల్లో మరో మూడు ఎకరాలను ఆక్రమించారు. మొత్తంగా ఆరు ఎకరాల్లో మూడు ఎకరాలకు ఒకటి చొప్పున రెండు రొయ్యల చెరువులను తవ్వారు. ఈ రెండు చెరువులకు మధ్యలో దారి వదిలారు. రెండు చెరువుల గట్టుగా ఈ దారి ఉంటుంది. ఈ దారి మీదుగానే శ్మశానానికి వెళుతున్నారు. గ్రామస్థులు ఈ ఆక్రమణల గురించి ప్రశ్నిస్తే అధికారం అండ కలిగిన అక్రమార్కులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం.

కాపల పెట్టి మరీ రొయ్యల సాగు

అక్రమార్కులు ఆక్రమించిన పీడబ్ల్యూడీ భూములు మూడు ఎకరాలలో చెరువును తవ్వి.. రొయ్యల సాగు చేపట్టారు. ఈ చెరువుకు కాపలదారుడిని కూడా పెట్టారు. అతని కుటుంబం కోసం తాత్కాలికంగా ఒక షెడ్‌ కూడా వేశారు. రొయ్యలకు మేత వంటివి కాపలా కుటుంబమే చూసుకుంటుంది. ఆక్రమణదారులు అప్పుడప్పుడు వచ్చి చెరువును చూసుకుని వెళుతున్నారు. శ్మశానం స్థలంలో ఆక్రమించుకున్న మూడు ఎకరాలలో చెరువు తవ్వినప్పటికీ ఇంకా రొయ్యల సాగు చేపట్టలేదు. రొయ్యల సాగు కోసం చెరువులో నీటిని నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నీటిని నింపిన తర్వాత రెండో చెరువులో కూడా రొయ్యలను సాగు చేయనున్నారు.

మిగిలిన శ్మశాన స్థలంపైనా కన్ను

శ్మశానానికి సంబంధించి ఇంకా మూడున్నర ఎకరాలు ఉండటంతో .. అక్రమార్కులు వాటిపైనా కన్ను వేశారు. ఈ మూడు ఎకరాలను కూడా చెరువు తవ్వాలని ప్లాన్‌ చేసినట్టు సమాచారం. వెంట వెంటనే చెరువులను తవ్వవద్దని స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సూచించటంతో తాత్కాలికంగా ఆగారని తెలిసింది. లేదంటే ఈ పాటికే మూడో చెరువు ఏర్పాటయ్యేదని, రానున్న రోజుల్లో మిగులు శ్మశాన స్థలం కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో..

శ్మశాన స్థలం, పీడబ్ల్యూడీ భూముల ఆక్రమణ వెనుక స్థానిక రెవెన్యూ అధికారుల హస్తం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే జింజేరు పరిధిలోని ఆక్రమిత పీడబ్ల్యూడీ భూములకు రెవెన్యూ అధికారులు కొంతమందికి పట్టాలు ఇవ్వటంపై ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి. కలెక్టర్‌ బాలాజీ ఆ దిశగా ఇంకా చర్యలు చేపట్టలేదు.

Updated Date - Aug 03 , 2025 | 01:27 AM