NTR District: అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ అల్పాహారం
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:17 AM
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం సింగ్‌నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్‌లో ఆహార నాణ్యత, శుభ్రత, మరియు ఇతర సౌకర్యాలు తనిఖీ చేసి ఆకలితో ఉన్న వారికి అన్నపూర్ణం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్), ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం సింగ్‌నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. నగర మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి అన్న క్యాంటీన్‌కు వచ్చిన కలెక్టర్ లైనులో నిలబడి రూ.5 చెల్లించి టోకెన్ కొని, అల్పాహారాన్ని రుచి చూశారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న శైలి, డైనింగ్ ఏరియాతోపాటు మంచినీరు, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాలను పరిశీలించారు. నాణ్యత, క్యాంటీన్‌లో పరిశుభ్రతపై అక్కడ ఆహారం తీసుకుంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 05:17 AM