Nara Lokesh: ఎన్‌ఆర్‌ఐలే బ్రాండ్ అంబాసిడర్లు
ABN, Publish Date - Jul 28 , 2025 | 04:01 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మీరంతా చూస్తున్నారు.
రాష్ట్రాభివృద్ధిలో వీరంతా భాగస్వాములు కావాలి
ఏపీలో సింగపూర్ ఎఫ్‌డీఐలకు సహకరించండి
తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేశ్
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారంగా చేసి పెట్టుబడులు రాబడదాం’ అని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్‌టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు, రాష్ట్రాభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలంతా భాగస్వాములు కావాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం 81.04 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే, అందులో సింగపూర్ నుంచే దాదాపు 14.94 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇది మొత్తం ఎఫ్‌డీఐలలో 19శాతం. ఈ పెట్టుబడుల్లో అధిక శాతం ఏపీకి వస్తే మన రాష్ట్రం మరో సింగపూర్ అవుతుంది. ఇక్కడ ఉద్యోగులుగా ఉన్న మీలో చాలామంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యజమానులుగా మారడానికి అనేక అవకాశాలు ఉన్నాయి’ అని లోకేశ్ అన్నారు. ‘సింగపూర్‌లో తెలుగువారి ఉత్సాహం సూపర్. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన దగ్గరనుంచి తెలుగు ప్రవాసుల సమావేశం వరకు ఎక్కడ చూసినా తెలుగువారే. నేను సింగపూర్‌లో ఉన్నానా? సింహాచలంలో ఉన్నానా? అని సందేహం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగువారి ఆధిపత్యమే కనిపిస్తుంది. సింగపూర్‌ను శాసించేది కూడా తెలుగువారే. అందరూ మిమ్మల్ని ఎన్నారైలు అంటారు. కానీ నా మనస్సులో ఎప్పుడూ మీరు ఎంఆర్‌ఐలే. అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (అత్యంత విశ్వసనీయ భారతీయులు). సింగపూర్‌లో ఉన్నా, మలేసియాలో ఉన్నా.. మీ మనసంతా ఎప్పుడూ మన రాష్ట్రం పైనే ఉంటుంది. రాష్ట్రంపై మీకు ఎంత ప్రేమ ఉందో గత ఎన్నికల్లో చూశాను.
రాష్ట్రంలో సైకో పాలన పోవాలని ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా ఏకమయ్యారు. ఆయనను జైల్లో పెట్టిన 53 రోజులు వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ర్టాన్ని కాపాడుకోవటానికి మీరంతా సెలువులు పెట్టి మరీ రాష్ర్టానికి వచ్చి పనిచేశారు. కూటమి ప్రభుత్వం 44 శాతం ఓట్లతో 164 సీట్లు గెలవటంలో కీలక పాత్ర పోషించారు.
మన బ్రాండ్ సీబీఎన్
ప్రతి దేశానికి, ప్రతి వస్తువుకు ఒక బ్రాండ్ ఉంటుంది. సింగపూర్ అంటే అభివృద్ధి. ఏపీలో అభివృద్ధి అంటే సీబీఎన్. ఇది మన బ్రాండ్. సీబీఎన్ బ్రాండ్‌తో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పెట్టుబడులు వస్తాయి. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ కోసం మేం ఇక్కడకు వచ్చాం. రాష్ర్టానికి పెట్టుబడులను సాధించే మా ప్రయత్నాలకు మీ సహకారం అవసరం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రోల్ మోడల్ సింగపూర్‌ని ఆదర్శంగా తీసుకుని నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం. మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్న మన రాష్ర్టానికి పెట్టుబడుల ప్రతిపాదనతో రండి. అనుమతులు తీసుకునివెళ్లండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. 20 లక్షల ఉద్యోగాల కల్పన.. ఇదే మన నినాదం... ఇదే మన విధానం. జీరో పావర్టీ లక్ష్యంగా చంద్రబాబు తలపెట్టిన పీ4కి ఎన్నారైల సహకారం కోరుతున్నాం. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలన్నదే చంద్రబాబు కోరిక. ఆరోగ్యవంతమైన సంపన్నవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి పనిచేద్దాం. పీ4లో మార్గదర్శిగా చేరండి... పేద కుటుంబాలకు ఆసరాగా నిలవండి.
డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి!
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. కేంద్రంలో మోదీ, ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్నాం. ఐదేళ్లలో నష్టపోయినదంతా వడ్డీతో సహా తీసుకొస్తాం. ఇతర దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్కిల్ డెవల్‌పమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎంఎ్‌సఎంఈ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాం. టీసీఎ్‌సలో 35 శాతం తెలుగు వారు పనిచేస్తున్నారు. అందుకే ఏపీకి వస్తున్నామని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. మీరంతా సహకరిస్తే ఏపీని నంబర్ వన్‌గా తయారు చేస్తాం. అభివృద్ధిలో రాష్ర్టాన్ని పరుగులు తీయిస్తాం. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. సింగపూర్‌లో ఇంతమంది తెలుగువారు రావడం ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఉన్నవారిలో ఒక ఎనర్జీ కనపడుతోంది. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న కసి మీలో ఉంది’ లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 28 , 2025 | 04:05 AM