Defamation: సీఎంపై అసభ్య వ్యాఖ్యల కేసులో..కొడాలి నానికి నోటీసులు
ABN, Publish Date - Aug 04 , 2025 | 03:32 AM
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. విచారణ కోసం ఆయనకు పోలీసులు నోటీసులు కూడా జారీచేశారు.
మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు
గుడివాడ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. విచారణ కోసం ఆయనకు పోలీసులు నోటీసులు కూడా జారీచేశారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ గతేడాది విశాఖకు చెందిన అంజనాప్రియ ఫిర్యాదు చేశారు. దీనిపై విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం వారు గుడివాడ వచ్చి కొడాలి నాని ఇంటికి వెళ్లి.. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, అందుబాటులో ఉండాలంటూ ఆయనకు 41ఏ సెక్షన్ కింద నోటీసులు అందజేశారు.
Updated Date - Aug 04 , 2025 | 03:34 AM