CS Vijay Anand: ఎవ్వరినీ ఒత్తిడి చేయొద్దు
ABN, Publish Date - Aug 01 , 2025 | 06:25 AM
స్వర్ణాంధ్ర పీ4 అమలుకు మార్గదర్శులను గుర్తించే విషయంలో ఎలాంటి విమర్శలు, వివాదాలకూ తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...
స్వచ్ఛందంగానే మార్గదర్శులు ముందుకొచ్చేలా చూడాలి: సీఎస్
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర పీ4 అమలుకు మార్గదర్శులను గుర్తించే విషయంలో ఎలాంటి విమర్శలు, వివాదాలకూ తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపుతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మార్గదర్శిలకే బంగారు కుటుంబాలను దత్తత ఇవ్వాలన్నారు. ఆగస్టు 16న పీ4 కార్యక్రమం భారీ స్థాయిలో ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున 15వ తేదీలోగా నిర్ణీతా లక్ష్యాలను సాధించాలని సూచించారు.
Updated Date - Aug 01 , 2025 | 06:26 AM