SW Director Lavanyaveni: తల్లికి వందనం రాలేదన్న ఆందోళన వద్దు
ABN, Publish Date - Jul 25 , 2025 | 05:25 AM
రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్ చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు తమకు తల్లికి వందనం రాలేదని ఆందోళన చెందవద్దని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి విజ్ఞప్తి చేశారు.
సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్ చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు తమకు తల్లికి వందనం రాలేదని ఆందోళన చెందవద్దని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె గురువారం ఒక ప్రకటన చేశారు. ‘పైన పేర్కొన్న తరగతుల్లో రాష్ట్రంలోఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారు. తల్లికి వందనం పథకంలో వారికి సంబంధించిన కొంత వాటాను కేంద్రం భరిస్తుంది. కేంద్రం వాటా సొమ్ము బ్యాంక్ లింకేజీ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో మరో 20 రోజుల్లో జమవుతుంది’ అని లావణ్య వేణి తెలిపారు.
Updated Date - Jul 25 , 2025 | 05:26 AM