TTD pediatric trust: చిన్నపిల్లల వైద్య సేవలకు టీటీడీ నూతన ట్రస్టు
ABN, Publish Date - May 22 , 2025 | 05:55 AM
టీటీడీ చిన్నపిల్లల వైద్యసేవల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మెరుగైన చికిత్సల కోసం ఎయ్ ఓ శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.
తిరుపతి(వైద్యం), మే 21(ఆంధ్రజ్యోతి): టీటీడీలోని పలు ట్రస్టుల తరహాలో చిన్నపిల్లల వైద్యసేవల కోసం నూతనంగా ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసేందుకు నియమ నిబంధనలతో నివేదిక సిద్ధం చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిని బుధవారం తనిఖీ చేసిన ఆయన.. అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో చిన్నారులకు మెరుగైన గుండె సంబంధిత చికిత్సలు అందించేందుకు శ్రీవెంకటేశ్వర ఆపన్న హృద టయం స్కీం ఉందని.. దీని కింద దాతలు రూ.లక్ష విరాళం అందిస్తే ఒక చిన్నారికి ఉచితంగా అపరేషన్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:55 AM