ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టి ఎద్దుల అమావాస్య

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:36 PM

వాన కరువైన చోట మట్టి మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. తరతరాల ఆచారాల్లో నమ్మకాల్లో వాన రాక కోసం ఎన్నో ఆరాటాలు దాగి ఉంటాయి.

హొళగుందలోని నాయి బ్రాహ్మణ వీధిలో మట్టి ఎద్దులకు పూజలు చేసని చిన్నారులు

వాన కోసం మట్టికి పూజలు

ఆడి పాడిన చిన్నారులు

హొళగుంద, జూన 25 (ఆంధ్రజ్యోతి) : వాన కరువైన చోట మట్టి మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. తరతరాల ఆచారాల్లో నమ్మకాల్లో వాన రాక కోసం ఎన్నో ఆరాటాలు దాగి ఉంటాయి. కర్నాటక సరిహద్దులోని కరువు పీడిత హొళగుంద ప్రజా జీవితంలో మట్టి పండుగ ఒక విశేషం. పిల్లలు మట్టితో ఎద్దులు చేసి, పూజించి ఊరేగిస్తారు. మట్టితో మనిషి సంబంధాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఈ వేడక పేరు మట్టి ఎద్దుల అమావాస్య. హొళగుందలోని బీసీ కాలనీ, నాయిబ్రాహ్మణ వీధిలో చిన్నారులు బుధవారం మట్టి ఎద్దుల అమావాస్య పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయమే చెరువుకు వెళ్లి మట్టిని తెచ్చి, కుమ్మరితో ఎద్దులు చేయించుకున్నారు. వాటిని ఇంటికి తీసుకువెళ్లి పూజలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం మట్టి ఎద్దులకు సినిమా హీరోలు బాలకృష్ణ, పవన కళ్యాణ్‌ ఫొటోలను ముస్తాబు చేసి, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామాల్లో నమ్మకం.

Updated Date - Jun 25 , 2025 | 11:36 PM