Temperature: నెల్లూరులో 38.7 డిగ్రీలు
ABN, Publish Date - Aug 03 , 2025 | 04:15 AM
వర్షాకాలంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. శనివారం అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్న సమయంలో పలుచోట్ల వేడి గాలులు వీచాయి.
గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్యధికం
కోస్తాలో పలుచోట్ల 35 నుంచి 38 డిగ్రీలు
రేపటినుంచి దక్షిణ కోస్తా, సీమలో వర్షాలు
విశాఖపట్నం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. శనివారం అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్న సమయంలో పలుచోట్ల వేడి గాలులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 5డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 38.7 డిగ్రీలు నమోదైంది. గడచిన నాలుగు దశాబ్దాల్లో ఆగస్టు నెలలో నెల్లూరులో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. కోస్తాలో పలుచోట్ల 35 నుంచి 38 డిగ్రీలు వరకూ నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, సోమవారం నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం కూడా చాలా ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వెల్లడించింది.
Updated Date - Aug 03 , 2025 | 04:15 AM