నీట్ ఫలితాలు విడుదల
ABN, Publish Date - Jun 14 , 2025 | 11:44 PM
మెడికల్, డెంటల్ యునాని కోర్సుల ప్రవే శాల కోసం నిర్వహించిన నీట్-యూజీ-2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల య్యాయి.
కర్నూలు పట్టణానికి చెందిన వారిదే హవా
ఆలిండియా స్థాయిలో గోవర్దనచౌదరికి 431వ ర్యాంకు
ఎస్టీ కేటగిరిలో మెగావత అఖిల్ బాలాజీనాయక్ 27వ ర్యాంకు
కర్నూలు ఎడ్యుకేషన్, జూన 14(ఆంధ్రజ్యోతి): మెడికల్, డెంటల్ యునాని కోర్సుల ప్రవే శాల కోసం నిర్వహించిన నీట్-యూజీ-2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల య్యాయి. కర్నూలు పట్టణానికి చెందినవారే హవా కొనసాగించారు. ఈ పరీక్ష ఫలితాల్లో కర్నూలు సంతోష్‌నగర్‌కు చెందిన ఆర్.గోవర్దన చౌదరి 621/720 మార్కులతో జనరల్ కేటగిరిలో ఆలిండియా స్థాయిలో 431వ ర్యాంకు, కేటగిరి విభాగంలో 281వ ర్యాంకు సాదించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు. డి.హేమ సాగరిక 595 మార్కులతో ఆలిండియా స్థాయిలో 1721వ ర్యాంకును, కేటగిరిలో 44వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. సఫా సైఫా ఖురేషీ 585 మార్కులు, జనరల్ కేటగిరిలో ఆలిండియా స్థాయిలో 22814వ ర్యాంకును, కేటగిరి విభాగంలో 1505వ ర్యాంకు సాధించారు. అఖిల్ బాలాజీనాయక్ మెగావత 576 మార్కులతో ఆలిండియా స్థాయిలో 4169వ ర్యాంకును, ఎస్టీ కేటగిరిలో 27వ ర్యాంకును, ఎస్.సమిత 572 మార్కులతో ఆలిండియా స్థాయిలో 4970వ ర్యాంకును, కేటగిరి విభాగంలో 2453వ ర్యాంకును, శ్రీసాయి ఫణీంధ్ర దాసరి 570 మార్కులతో ఆలిండియా స్థాయిలో 5369వ ర్యాంకును, ఎస్సీ కేటగిరి విభాగంలో 126వ ర్యాంకును, జయాంశ 551 మార్కులతో ఆలిండియా స్థాయిలో 11587వ ర్యాంకును, కేటగిరి విభాగంలో 4926వ ర్యాంకును సాధించారు. గూడూరు చెందిన చంద్రశేఖర కుమార్తె శ్రీధన్య 592 మార్కులతో ఆలిండియా స్థాయిలో 2032వ ర్యాంకు సాధించారు. కార్తీక్ మాచాని 560 మార్కులతో ఆలిండియా స్థాయిలో 8421వ ర్యాంకును, కేటగిరి విభాగంలో 3468వ ర్యాంకు, పగిడ్యాల దీపిక 544 మార్కులతో ఆలిండియా స్థాయిలో 14962వ ర్యాంకును, ఎస్సీ కేటగిరిలో 335వ ర్యాంకును, బి.ప్రసన్నదీప్ 543 మార్కులతో ఆలిండియా స్థాయిలో 15,548వ ర్యాంకును, ఎస్సీ కేటగిరి విభాగంలో 353వ ర్యాంకును, గురు పృథ్వి 538 మార్కులతో ఆలిండియా స్థాయిలో 18657వ ర్యాంకును, ఎస్సీ కేటగిరి విభాగంలో 419వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈసారి విడుదలైన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో వంద లోపు ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు లేకపోవడం కొసమెరుపు.
డాక్టర్ అయి వైద్యసేవలు అందిస్తా
గొప్ప డాక్టర్‌నై పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నది లక్ష్యం. నారాయణ కళాశాలలో ఇంటర్ వరకు చదివా. ఇంటర్‌లో 977/1000 మార్కులు సాధించా. నీట్ పరీక్షలో 621/720 మార్కులతో ఆలిండియా స్థాయిలో 431వ ర్యాంకును, కేటగిరి వారిగా 281వ ర్యాంకు సాధించా. కర్నూలు నగరంలోనే అగ్రస్థానంలో నిలిచా. తల్లిదండ్రులు యుగంధర్ చౌదరి, తల్లి యామిని అభినందించారు.
ఫ ఆర్.గోవర్దన చౌదరి, సంతోష్‌నగర్, కర్నూలు: (621 మార్కులు, 431వ ర్యాంకు):
కార్డియాలజిస్టు అవుతా
మెడిసిన చదివి కార్డియాలజిస్టు అవుతా. తండ్రి రామాంజనేయులు నాయక్ పశుసంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్. తల్లి సావిత్రిబాయి కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1గా పనిచేస్తున్నారు. నీట్ పరీక్షలో 576మార్కులు, ఆలిండియా స్థాయిలో 4169వ ర్యాంకు, ఎస్టీ కేటగిరి విభాగంలో 27వ ర్యాంకును సాధిం చా. జిప్‌మర్ యూనివర్సిటీలో మెడిసిన చేసి కార్డియాలజిస్టుగానూ, రేడియాలజిస్టుగా స్థిరపడాలన్నదే లక్ష్యం. ఈర్యాంకు రావడానికి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సోదరి ప్రోత్సాహమే కారణం.
ఫ అఖిల్ బాలాజీనాయక్ మెగావత, కర్నూలు:
ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.
డాక్టర్ కావాలన్నదే లక్ష్యం. పడిన కష్టానికి ఉత్తమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. తండ్రి డా.బీవీ శ్రీహరిబాబు. జి.పుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో ప్రొఫెసర్. తల్లి మంజులవాణి ఎంపీడీవో, ప్రస్తుతం డీపీఆర్‌సీలో జిల్లా కోఆర్డినేటర్. ఇంటర్ కర్నూలు నారాయణ కళాశాలలో చదివా. ఇంటర్‌లో 937/1000 మార్కులు సాధించా.
ఫడి.హేమ సాగరిక, 595 మార్కులు, ఎస్సీ కేటగిరిలో 44వ ర్యాంకు
ప్రజలకు సేవ చేస్తా
కార్డియాలజిస్టు అయి ప్రజలకు సేవ చేస్తా. అమ్మ శ్యామల కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో అధ్యాపకురాలు. ఇంటర్ కర్నూలు నారాయణ కాలేజీలో చదివా. ఇంటర్ పబ్లిక్ పరీక్షలో 980/1000 మార్కులు సాధించా. దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ, భూపాల్, వంటి ప్రముఖ మెడికల్ కళాశాలలో మెడిసిన చేయాలన్నదే ధ్యేయం. ఉత్తమ ర్యాంకు రావడానికి అమ్మ ప్రోత్సాహంతో పాటు అధ్యాపకుల కృషి ఎంతగానో ఉంది.
ఫ దాసరి శ్రీసాయి ఫణీంద్ర, 570 మార్కులు, ఆలిండియా స్థాయిలో 5369, ఎస్సీ కేటగిరిలో 126వ ర్యాంకు
ఎమ్మిగనూరుకు విద్యార్ధికి 133వ ర్యాంకు
- కార్డియాలజీస్టు కావలన్నదే లక్ష్యం - మహ్మద్ సోహెల్
ఎమ్మిగనూరు, జూన 14(ఆంధ్రజ్యోతి): నీట్ ఫలితాల్లో ఎమ్మిగనూరుకు చెందిన విద్యార్ధి ఎస్‌కే మహ్మద్ సోహెల్ జాతీయస్థాయిలో 640 మార్కులతో ఓసీలో 133వ ర్యాంకు సాధించి కేటగిరి విభాగంలో 94వ ర్యాంకుతో జిల్లాలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. కోడుమూరులో ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కమల్‌సాహెబ్, బదినేహాల్ జడ్పీఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ నసీమున్నీసాలు ఎమ్మిగనూరు పట్టణంలోని మునెప్పనగర్‌లో నివా సం ఉంటున్నారు. వీరికి ఇద్దురు కుమారులు. ఒక కుమారుడు బీటెక్ పూర్తి చేయగా, మరో కుమారుడు ఎస్‌కే మహ్మద్ సోహెల్ ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో పూర్తిచేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వంలో ఎస్‌కే మహ్మద్ సోహెల్ ప్రతిభ కనబరిచాడు. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 640 మార్కులతో ఓసీ కేటగిరిలో 133వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎస్‌కే మహ్మద్ సోహెల్‌ను అభినందించి మిఠాయిలు తినిపించారు. సోహెల్ మాట్లాడుతూ అమ్మానాన్నల ప్రోత్సాహంతోపాటు గురువులు సూచించిన ప్రకారం చదివి ఈ ర్యాంకును సాధించానన్నారు. కార్డియాలజిస్ట్ కావలన్నదే తన లక్ష్యమని, పేదలకు ఉచిత వైద్యం అందిస్తానన్నారు.
నీట్‌లో నంద్యాల విద్యార్థులు ప్రతిభ
నంద్యాల ఎడ్యుకేషన, జూన 14 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నంద్యాల ఎస్‌డీఆర్ కళాశాలకు చెందిన భువనతేజ 610 మార్కులు సాధించి 221వ ర్యాంక్ సాధించాడు, పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజీవకుమార్ కుమారుడైన భువనతేజ తాను డాక్టర్‌గా వైద్యసేవలు అందిస్తూ తన తండ్రి బాటలో నడుస్తానని చెబుతున్నాడు. పాణ్యం గ్రామానికి చెందిన న్యాయవాది శ్రీకాంత కుమా రుడు జితేంత్ర 6586వ ర్యాంక్ సాధించాడు. నంద్యాలకు చెందిన న్యాయవాది రూపేంద్ర నాధ్‌రెడ్డి కుమారుడు దీక్షితరెడ్డి 8446 ర్యాంక్ దక్కించుకున్నాడు. ఎస్‌డీఆర్ కళాశాలలో చదివి కడపకు చెందిన వ్యవసాయ రైతు పెద్దమునిరెడ్డి కుమార్తె మునిజాహ్నవి 9642 ర్యాంక్ సాధించారు. ఎస్సీ కేటగిరీలో హనోక్‌స్పురనరాజ్ 424 మార్కులు సాధించి 8774 ర్యాంక్ పొందాడు. న్యూక్లియస్ కళాశాలకు చెందిన ప్రదీప్‌కుమార్ 753వ ర్యాంక్, ప్రియాంక 7500 ర్యాంక్, మౌనిక 9299 ర్యాంక్, సాధించారు.
అక్షరశ్రీ జూనియర్ కళాశాలకు...
ఆదోని అగ్రికల్చర్, జూన 14 (ఆంధ్రజ్యోతి) : నీట్ పరీక్ష ఫలితాల్లో పట్టణంలోని అక్షర శ్రీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని రేచల్ వీక్లీప్ ప్రతిభ చాటింది. నీట్‌లో 564/720 మార్కులు సాధించింది. 7178 ఆల్ ఇండియా ర్యాంకు రాగా, ఓపెన కేటగిరిలో 3355 ర్యాంకు వచ్చినట్లు తెలిపారు. విద్యార్థిని తండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా, తల్లి సంధ్యారాణి మోటివేషన స్పీకర్‌గా, ఎనఎ్‌సఎ్‌స డివిజన అధికారిగాపనిచేస్తున్నారు. కళాశాల యాజమాన్యం మేఘనాథ్ రెడ్డి అభినందించారు.
Updated Date - Jun 14 , 2025 | 11:44 PM