ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Birthday Celebrations : తిరుపతిలో ఘనంగా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Jan 24 , 2025 | 05:22 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

  • 42 కిలోల కేక్‌ కట్‌చేసిన సాధు పరిషత్‌ ప్రతినిధులు

తిరుపతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు గురువారం అలిపిరిలోని గరుడ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. లోకేశ్‌ 42వ జన్మదినాన్ని పురస్కరించుకుని 42 కిలోల కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో లోకేశ్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని వారు అభిలషించారు. రాష్ట్రంలో నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగ యువతకు దిక్సూచిలా, అన్నగా వారిని ఆదుకునే శక్తియుక్తులు ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జగన్నాథం, సుమన్‌ నాయుడు, నీలకంఠం, గోకుల్‌, మధు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 05:22 AM