వైసీపీ ఐదేళ్లలో చేయని అభివృద్ధినిఏడాదిలోనే చేశాం: నాగబాబు
ABN, Publish Date - Aug 01 , 2025 | 05:23 AM
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
కొత్తూరు(అనకాపల్లి), జూలై 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. గురువారం అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో పదిహేనేళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ‘పొత్తు’కు కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, సర్దుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. రాక్షస పాలన, దుర్మార్గపు పాలన చేసిన వైసీపీని మరోసారి గద్దెనెక్కించకూడదన్నారు. ఐదేళ్లలో లిక్కర్, భూములు, మట్టి తవ్వకాలు తదితరాల్లో వైసీపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ నేతలకు ప్రజల్లో తిరిగే అర్హత లేదన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమే్‌షబాబు, సుందరపు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 05:24 AM