ఎక్కడైనా రేషన్!
ABN, Publish Date - Jun 02 , 2025 | 01:03 AM
కార్డుదారులు తమకు నచ్చిన లేదా దగ్గరగా ఉన్న చౌకధరల దుకాణం ద్వారా సరుకులు తీసుకునే అవకాశాన్ని కల్పించామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిం చారు. పిఠాపురం నూకాలమ్మ గుడి వీధి 18వ వార్డులో చౌక ధరల దుకాణం ద్వారా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సరుకుల పంపిణీని ప్రారంభించారు.ఈ పోస్ యంత్రంపై కార్డుదారులు వేలిముద్ర వేసిన తర్వాత వారికి సరుకులను అందజేసి మాట్లాడారు.
రేషన్ పంపిణీ ప్రారంభంలో మంత్రి నాదెండ్ల మనోహర్
వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్
ఉదయం 8 నుంచి పంపిణీ
డీలర్ల అవకతవకలు సహించం
ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు
డిపో వద్ద నెంబర్ల ఏర్పాటు
బియ్యం స్మగ్లింగ్ చేస్తే పీడీ యాక్ట్
21 రోజుల్లో కొత్త కార్డులు
పిఠాపురం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): కార్డుదారులు తమకు నచ్చిన లేదా దగ్గరగా ఉన్న చౌకధరల దుకాణం ద్వారా సరుకులు తీసుకునే అవకాశాన్ని కల్పించామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిం చారు. పిఠాపురం నూకాలమ్మ గుడి వీధి 18వ వార్డులో చౌక ధరల దుకాణం ద్వారా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సరుకుల పంపిణీని ప్రారంభించారు.ఈ పోస్ యంత్రంపై కార్డుదారులు వేలిముద్ర వేసిన తర్వాత వారికి సరుకులను అందజేసి మాట్లాడారు. ప్రతి దుకాణానికి నిర్దేశించిన కోటా కంటే అదనంగా పదిశాతం సరుకులు పంపామని చెప్పారు. చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో ఎక్కడ తప్పు జరిగినా తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. కార్డుదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా అన్ని అవకాశాలు కల్పిస్తున్నా మన్నారు. ప్రతి చౌక ధరల దుకాణం వద్ద డీలరు పేరు, షాపు నెం బరు ఇతర వివరాలు ప్రదర్శించడంతో పాటు వాటిపైనే డీఎస్‌వో, తహశీల్దార్, ఇతర అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ ఫోన్ల ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సరుకుల పంపిణీలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఉండే తెలపవచ్చునని చెప్పారు. తూకం, సరుకుల నాణ్యత తదితర అంశాల్లో లోపాలు ఉన్నా, సమయానికి తెరవకున్నా ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీటిని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ నేతృత్వంలోని కేంద్ర కార్యాలయం నిరంతరం సమీక్షిస్తూ ఉం టుందని తెలిపారు. రేషన్ డిపోల ద్వారానే కార్డుదారులకు నిజాయితీగా సరుకులు అందు తాయని చెప్పారు. కాకినాడ పోర్టు ద్వారా జరిగే బియ్యం స్మగ్లింగ్ అరికట్టామని, అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. బియ్యం స్మగ్లింగ్‌పై పీడీ యాక్డు కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. రేషన్ షాపులు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 8నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంటాయని తెలిపారు. కాకినాడ జిల్లాలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు 71 వేల మంది ఉన్నారని గుర్తించామని, వీరికి ప్రతి నెలా 5వతేదీ లోగా సరుకులు అందించి ఫొటో లు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉం టుందని చెప్పారు. పింఛన్ల పంపిణీ మాదిరిగా గంటగంటకు, ప్రతి రోజూ సరుకుల పంపిణీ వివరాలు తెలిపేందుకు ప్రత్యేక యాప్ రూపొం దించామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. కొత్తకార్డులు, సభ్యులు చేర్పు, తొలగింపు, చిరునామాల మార్పు తదితరాల కోసం చేసిన దరఖాస్తులను 21 రోజుల్లో పరిష్కరించి కొత్తకార్డులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పం తం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్‌ఎన్ వర్మ, పెండెం దొరబాబు, జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్,కలెక్టర్ సగిలి షాన్‌మోహన్, జేసీ రాహుల్‌మీనా,పాడా పీడీ చైత్రవర్షిణి, 18వ వార్డు కౌన్సిలరు పంపనబోయిన అన్నపూర్ణ పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 01:03 AM