త్వరితగతిన పూర్తి చేయాలి
ABN, Publish Date - Jul 29 , 2025 | 11:41 PM
పట్టణంలోని జుర్రేరు డ్రైనేజీ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని పంచా యతీరాజ్ అధికారులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.
మంత్రి బీసీ జనార్దనరెడ్డి
జుర్రేరు డ్రైనేజీ పనుల పరిశీలన
బనగానపల్లె, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జుర్రేరు డ్రైనేజీ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని పంచా యతీరాజ్ అధికారులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని బంగారమ్మ తోట జుర్రేరు వాగు సమీపంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. పనులు నాణ్యంగా చేయాలని ఆదేశించారు. స్థానికులు సమస్యలను ఆయన దృష్టికి తీసుక రాగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట బనగానపల్లె పంచాయతీరాజ్ డీఈ నాగశ్రీనివాసులు, తహసీల్దారు నా రాయణరెడ్డి, మైనర్ ఇరిగేషన ఏఈ రామ్మోహనరెడ్డి, సీఐలు మంజునా థరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఈవో సతీశరెడ్డి, సర్వేయర్లు, కాంట్రాక్టర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 11:41 PM