ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పు చెల్లించమనందుకే హత్య

ABN, Publish Date - May 18 , 2025 | 11:02 PM

అప్పును చెల్లించమనందుకే పెద్దవెంకటేష్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లుట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.

కత్తులతో నరికివేత

ప్రధాన నిందితుడి అరెస్టు

పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య

వీడిన పెద్దవెంకటేష్‌ హత్య కేసు మిస్టరీ

ఆలూరు, మే18(ఆంధ్రజ్యోతి): అప్పును చెల్లించమనందుకే పెద్దవెంకటేష్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లుట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కంటినేని సోమన్నను పోలీసులు అరెస్టుచేశారు. ఆదివారం సాయంత్రం ఆలూరు పోలీ్‌సస్టేషన్‌లో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. అమృతాపురం గ్రామానికి చెందిన కంటినేని పెద్ద వెంకటేష్‌ అందరికీ వడ్డీలకు అప్పులు ఇచ్చేవాడు. బంధువు అయిన కంటినేని సోమన్నకు కూడా రూ.2.50లక్షలు అప్పు ఇచ్చాడు. డబ్బులు చెల్లించాలని వెంకటేష్‌ ఒత్తిడి చేయగా రూ.60వేలు వడ్డీ సోమన్న చెల్లించాడు. ఇంకా రూ.4లక్షలు అప్పు ఉందని వెంకటేష్‌ దబాయించాడు. సోమన్నతో తిరిగి ప్రాంసరీ నోటు రాయించుకున్నాడు. మిగిలిన అప్పు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడుతుండగా పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా కొనసాగింది. సోమన్న కల్యాణదుర్గం మండలం శెట్టూరులో పొలం కౌలుకు తీసుకుని అక్కడే ఉంటున్నాడు. కాగా వెంకటేష్‌ అప్పు చెల్లించాలంటూ సోమన్నపై కోర్టులో కేసు వేశాడు. గ్రామంలో సోమన్నకు చెందిన ఐదెకరాల పొలంను ఆక్రమించుకొని సాగుచేస్తున్నాడని, అతడి భార్యతో వివాహేతర సంబంఽధాన్ని వెంకటేష్‌ కొనసాగిస్తున్న విషయాన్ని నటరాజగౌడ్‌ సోమన్నకు చెప్పాడు. దీంతో ఎలాగైనా సరే వెంకటేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. బావమరిది ధనుంజయ్‌, హొళగుందకు చెందిన చాకలి నాగరాజు, అమృతాపురానికి చెందిన నటరాజగౌడ్‌, కర్ణాటకలోని ఉత్తనూరుకు చెందిన జోగప్ప కలిసి హత్య చేసేందుకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారమే పశువులు మేపేందుకు వెళ్లిన కంటినేని పెద్ద వెంకటే్‌షను కత్తులతో నరికి చంి పారు. ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ చంద్రతో కలిసి అన్ని దర్యాప్తు చేశారు. మిగిలిన ఐదుగురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని, ప్రధాన నిందితుడు నిందితుడు సోమన్నను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - May 18 , 2025 | 11:02 PM