Train Cancellations: ఆగస్టు 26 నుంచి పలు రైళ్లు రద్దు
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:33 AM
విశాఖ నగర శివార్లలోని తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్, ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆగస్టు 26...
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగర శివార్లలోని తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్, ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆగస్టు 26 నుంచి పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు విశాఖపట్నం సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. వచ్చే నెల 26, 28, 30 తేదీల్లో రాజమండ్రి-విశాఖ (67285), విశాఖ-రాజమండ్రి (67286), కాకినాడ-విశాఖ (17267), విశాఖ-కాకినాడ మెము ప్యాసింజర్లు (17268), విశాఖ-విజయవాడ రత్నాచల్ (12717), విజయవాడ-విశాఖ రత్నాచల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12718) రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. 26, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ (22876), విశాఖ-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22875) రద్దు చేశామని పేర్కొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 04:34 AM