ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టి దందా!

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:51 AM

నున్నలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. బూరుగుల చెరువులో మూడు రోజులుగా జేబీసీలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతోంది. రోజుకు 500 ట్రిప్పులను తరలించి సొమ్ము చేసుకుంటోంది. అనధికారికంగా టోకెన్లు ముద్రించి మరీ మట్టి దందా నిర్వహిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

-నున్న బూరుగుల చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు

-రోజుకు 500 ట్రిప్పులు అక్రమంగా తరలింపు

-అనధికారికంగా ముద్రించిన టోకెన్‌ల విక్రయాలు

- మూడు రోజులుగా సాగుతున్న వ్యవహారం

- పట్టించుకోని అధికారులు

నున్నలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. బూరుగుల చెరువులో మూడు రోజులుగా జేబీసీలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతోంది. రోజుకు 500 ట్రిప్పులను తరలించి సొమ్ము చేసుకుంటోంది. అనధికారికంగా టోకెన్లు ముద్రించి మరీ మట్టి దందా నిర్వహిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ రూరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలోని హైస్కూల్‌ పక్కనే ఉన్న బూరుగుల చెరువులో గత మూడు రోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఓ వ్యక్తి వ్యవసాయ భూమి మెరక చేసుకునేందుకు తెచ్చుకున్న చిన్నపాటి అనుమతులను అడ్డం పెట్టుకుని గ్రామంలో కొందరు వ్యక్తులు మట్టి మాఫియాగా ఏర్పడి జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో మట్టిని భారీగా తరలిస్తున్నారు. సాధారణంగా గ్రామ చెరువుల్లో మట్టిని తవ్వేందుకు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల అనుమతులు కావాల్సి ఉంది. అనుమతులతో పాటు నిబంధనలూ ఉంటాయి. అయితే ఇక్కడ ఓ వ్యక్తి పేరుతో 0.215 ఎకరాల వ్యవసాయ భూమి మెరక చేసుకునేందుకు అనుమతులు తీసుకుని ఇష్టానుసారం మట్టిని తవ్వి అమ్మకాలు జరుపుతున్నారు. చెరువులో మట్టి తవ్వేందుకు అనుమతులు ఉన్నా అనుమతులు తీసుకున్న వ్యవసాయ భూమికి మాత్రమే మట్టిని తరలించాల్సి ఉంది. కానీ ఇక్కడ మట్టి వాణిజ్య అవసరాలకు మళ్లుతోంది. రోజుకు 500 ట్రాక్టర్‌ ట్రిప్పుల పైనే మట్టి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తవ్వకాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అనధికారిక టోకెన్ల విక్రయాలు

స్థానికంగా చెరువులో తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులు టోకెన్లను ముద్రించి బహిరంగంగా అమ్మకాలు జరిపేస్తున్నారు. ఒక్కో టోకెన్‌ రూ.200 విక్రయించి మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట మార్కెట్‌లో ట్రాక్టర్‌ మట్టి విలువ రూ. వెయ్యి పైనే ఉండటంతో టోకెన్లకు గిరాకీ పెరిగిపోయింది. టోకెన్లను సొంత మనుషులకు ఇస్తున్న సదరు వ్యక్తులు బయట మార్కెట్‌లో ప్రైవేట్‌ స్థలాలకు ట్రాక్టర్‌ రూ.వెయ్యికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూమిని మెరక చేసుకునేందుకు అనుమతులు తీసుకుంటే చెరువు వద్ద టోకెన్‌ల విక్రయాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 22 , 2025 | 12:52 AM