ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పులకించిన నేల తల్లి

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:49 AM

వానలు ఊపందుకున్నాయి. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు లక్ష హెక్టార్లలో వేరుశనగ, మొక్కజొన్న, కంది, ఉల్లి, మిరప, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేశారు.

పచ్చగా ఉన్న మిరప పంట

చురుగ్గా నైరుతి రుతు పవనాలు

ఊపందుకున్న వానలు

రైతన్నలు బిజీ బిజీ

వాడిన పైర్లు పచ్చగా

కర్నూలు అగ్రికల్చర్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): వానలు ఊపందుకున్నాయి. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు లక్ష హెక్టార్లలో వేరుశనగ, మొక్కజొన్న, కంది, ఉల్లి, మిరప, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేశారు. ఆ తర్వాత జూన నెలలో వర్షాలు మొండికేశాయి. దీంతో పొలంలో వేసిన విత్తనాలు మొలకెత్తకపోడంతో రైతలు నష్టపోయారు. ముందస్తు వర్షాల వల్ల పంటలు తొందరగా సాగు చేస్తే అధిక దిగుబడి చేతికి అందుతుందని తెగుళ్లు, కీటకాలు ఆశించవని, పెట్టుబడి ఖర్చులు తగ్గిపోతాయని రైతులు ఎంతో ఆనందించారు. అయితే జూన నెల వర్షాలు కువరలేదు. జూలై నెల ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాలు చురుగ్గా పని చేయడం మొదలైంది. ఈ నెల ఉమ్మడి జిల్లాలో 99 ఎంఎం వర్షం నమోదు కావాల్సి ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా సగటు 20ఎంఎం దాకా నమోదు కావడంతో రైతులు పొలం పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. విత్తనాల కోసం రైతులు డీలర్ల దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కోసం పరుగులు పెడుతున్నారు. యూరియాకు ఎక్కువ డిమాండ్‌ వస్తుండటంతో రైతుల విజ్ఞప్తి మేరకు సరిపడ యూరియాను అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో పత్తి 2.54లక్షల హెక్టార్లలో సాగవుతుందని అధికారుల అంచనా. వేరుశనగ ఒకటిన్నర లక్షల హెక్టార్లు, కంది లక్ష హెక్టార్లు, మొక్కజొన్న 50వేల హెక్టార్లు, కొర్ర 5వేల హెక్టార్లు, కూరగాయలు 35వేల హెక్టార్లు తదితర పంటలన్నీ కలిపి ఆరున్నర లక్షల హెక్టార్లలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజనలో పంటలు సాగు కానున్నాయి. జూలై నెలలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో ప్రభావం చూపడం వల్ల సగటు వర్షపాతం కంటే ఎక్కువే వర్షాలు నమోదవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:49 AM