ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పైసా వసూల్‌..

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:53 PM

నిత్యం 50 నుంచి 100 కు పైగా రిజిస్ర్టేషన్లు జరిగే కోసిగి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్టాంపు వెండర్లు పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు.

కోసిగి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం ముందు రిజిస్ర్టేషన కోసం వేచి ఉన్న లబ్ధిదారులు

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్టాంప్‌ వెండర్ల దోపిడీ

నాన జ్యూడిషియల్‌, ఈ-స్టాంపులపై అదనంగా రూ.100-200 వసూలు

వేలాది రూపాయలు అక్రమార్జన

చోద్యం చూస్తున్న సబ్‌ రిజిస్ర్టార్‌

కోసిగి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): నిత్యం 50 నుంచి 100 కు పైగా రిజిస్ర్టేషన్లు జరిగే కోసిగి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్టాంపు వెండర్లు పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోనే కోసిగి సబ్‌రిజిస్ర్టేషన కార్యాలయం ఆదాయంలో నెంబర్‌ వనగా ఉంది. అయితే.. కోసిగి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో నాన జ్యూడిషియల్‌ స్టాంపు వెండర్లు ముగ్గురు ఉన్నారు. వీరు ఎంత అడిగితే అంత రైతులు డబ్బులు సమర్పించుకోవాల్సిందే. రూ.100 నాన జ్యూడిషియల్‌ స్టాంపు కోసం అదనంగా రూ.100 నుంచి రూ.300ల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న కొంత మంది ఈ-స్టాంపులపై రూ.100 నుంచి రూ.200ల వరకు ప్రతి స్టాంపుపై అదనంగా వసూలు చేస్తున్నారనీ రైతులు రిజిస్ర్టేషన్ల కోసం వచ్చిన పలువురు చెబుతున్నారు. కోసిగిలో సీనియర్‌ డాక్యుమెంటు రైటర్‌ వద్ద కౌతాళం మండలానికి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. మొత్తం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఆమె పెత్తనం చలాయిస్తుంది. ఇప్పటికైనా జిల్లా సబ్‌ రిజిస్ర్టార్‌, కోసిగి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంపై తనిఖీ చేసి స్థానిక నాన జ్యూడిషియల్‌ స్టాంపు వెండర్లు, ఈ స్టాంప్‌ వెండర్ల లైసెన్సులను రద్దు చేసి కొత్తవారికి ఇవ్వాలని పలువురు ప్రజలు, రైతులు కోరుతున్నారు.

ఫిర్యాదు చేస్తే లైసెన్స రద్దు చేస్తాం

కోసిగి సబ్‌ రిజిస్ట్రర్‌ పరిధిలో నానజ్యూడిషియల్‌ స్టాంప్‌ వెండర్లు, ఈస్టాంపు వెండర్లు ఎవరైనా అధికంగా డబ్బులు వసూలు చేస్తే తనకు ిఫిర్యాదు చేస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తాం. రూ.100 స్టాంప్‌ అదనంగా వసూలు చేయరాదు. అధికంగా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. తీసుకుని వారి లైసెన్సులు రద్దు చేస్తాం.

బజారి, సబ్‌ రిజిస్ర్టార్‌, కోసిగి

Updated Date - Apr 24 , 2025 | 11:53 PM