సిద్ధాపురం చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే బుడ్డా
ABN, Publish Date - May 12 , 2025 | 11:31 PM
సిద్ధాపురం చెరువును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సోమవారం పరిశీలించారు.
ఆత్మకూరు, మే 12(ఆంధ్రజ్యోతి): సిద్ధాపురం చెరువును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనడీఆర్‌ఎ్‌ఫ నిధులతో చెరువు కట్టపై జంగిల్ క్లియరెన్స పనులను చేపట్టడంతో పాటు మట్టికట్ట పటిష్టతకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎడమ ప్రధాన కాల్వలో పూడికతీత పనులతో పాటు కాల్వ వెంట రహదారి పనులను కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆయకట్టు స్థిరీకరణకు పాటుపడుతానని అన్నారు. ఈయన వెంట టీడీపీ నాయకులు వై.యుగంధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మలన్న సేవలో ఎమ్మెల్యే బుడ్డా
శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సోమవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిదర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యేకు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
Updated Date - May 12 , 2025 | 11:31 PM