Liquor Scam Case: మిథున్‌రెడ్డితో భార్య, కుమారుడు ములాఖత్
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:19 AM
మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో భార్య లక్ష్మీదివ్య, కుమారుడు జశ్విన్ రెడ్డి ములాఖత్ అయ్యారు.
రాజమహేంద్రవరం అర్బన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో భార్య లక్ష్మీదివ్య, కుమారుడు జశ్విన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు వారిద్దరూ లాయర్‌తో కలిసి జైలు వద్దకు వచ్చారు. అనంతరం మిథున్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. తిరిగి 11.35 గంటలకు బయటకు వచ్చి వెంటనే కారు ఎక్కి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు మిథున్‌రెడ్డి భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆమె మాట్లాడకుండా కారెక్కి వెళ్లిపోయారు. మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులు ములాఖత్‌కు వస్తున్నారని తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్‌రామ్, కొంతమంది వైసీపీ నాయకులు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు.
Updated Date - Jul 27 , 2025 | 05:22 AM