Nimmala Ramanaidu:పోలవరం నిర్వాసితుల నిధులూ పక్కదారి
ABN, Publish Date - Jul 19 , 2025 | 05:48 AM
వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో ఐదేళ్లలో 3 శాతం పనులు చేస్తే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 6 శాతానికి పైగా పనులు పూర్తి చేసినట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
డిసెంబరుకల్లా డయాఫ్రంవాల్ పూర్తి: నిమ్మల
విశాఖపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో ఐదేళ్లలో 3 శాతం పనులు చేస్తే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 6 శాతానికి పైగా పనులు పూర్తి చేసినట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింద న్నారు. ఎడమ కాలువను పూర్తిచేసి ఉంటే ఉత్తరాంరధకు ఈపాటికే గోదావరి జలాలు అందేవన్నారు. శుక్రవారం విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో ఆయన మాట్లాడారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వాడుకోవడానికే పోలవరం-బనకచర్లను ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఏడాదికి మూడు వేల టీఎంసీల నీరు వృథాగా పోతుంటే అందులో 200 టీంఎసీల నీటిని వాడుకోవడానికి ఆ ప్రాజెక్టును రూపొందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
Updated Date - Jul 19 , 2025 | 05:52 AM