పాలకొలనులో మిస్సైల్ ప్రయోగం
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:50 PM
భారత రక్షణ రంగంలో మరో అడుగు ముందుకు పడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామ సమీపాన గల డిఫెన్స రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన(డీఆర్‌డీవో) ద్వారా గురువారం ప్రతిష్టాత్మకంగా చేసిన క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
రక్షణ రంగంలో మరో ముందడుగు
యూఎల్‌పీజీ-వీ3 పరీక్షలు విజయవంతం
దేశీయంగా సరికొత్త టెక్నాలజీతో సత్తా చాటారు
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
దేశ రక్షణ సామర్థ్యాలు బలోపేతం
సీఎం నారా చంద్రబాబునాయుడు
శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు పలువురి అభినందనలు
ఓర్వకల్లు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భారత రక్షణ రంగంలో మరో అడుగు ముందుకు పడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామ సమీపాన గల డిఫెన్స రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన(డీఆర్‌డీవో) ద్వారా గురువారం ప్రతిష్టాత్మకంగా చేసిన క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. మన దేశంలోనే తయారైన ఓ మిస్సైల్‌ను యూఏవీ లంచడ్ ప్రెసిషన గైడెడ్ మిస్సైల్(యూఎల్‌పీజీ-వీ3)కి సంబంధించిన పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన ఏరియా రేంజ్ (ఎనవోఏఆర్)లో డ్రోన నుంచి మిస్సైల్‌ను ఏ సమస్య లేకుండా డీఆర్‌డీవో విజయ వంతంగా ప్రయోగించిందని రక్షణ శాఖ తెలిపింది. గతంలోనూ డైరెక్టెడ్ ఎనర్జీ వెషన్స సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఇక్కడే ప్రయోగాలు చేశారు.
రక్షణ రంగంలో మైలురాయి : రాజ్‌నాథ్‌సింగ్, భారత రక్షణ శాఖ మంత్రి
డీఆర్‌డీవో ద్వారా చేసిన డ్రోన నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం రక్షణ రంగంలో మరో మైలురాయి అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఢిల్లీ నుంచి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మోడ్రన మిస్సైల్ వ్యవస్థను రూపొందించడంలో విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్‌డీవో, ఆ సంస్థ భాగస్వాములైన డిఫెన్స క్యాపిటల్ ప్రొక్యూర్‌మెంట్ పార్టనర్స్ (డీసీపీపీలు), మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈలు), స్టార్టప్‌లకు ఆయన అభినందనలు తెలిపారు. దేశీయంగా సరికొత్త టెక్నాలజీతో ఆత్మనిర్భర్ భారత ద్వారా సత్తా చాటడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయం దేశంలో అత్యాధునిక రక్షణ ఆవిష్కరణలలో స్వదేశీ టెక్నాలజీ పెరుగుతుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశకు గర్వంగా ఉంది: చంద్రబాబునాయుడు, సీఎం
కర్నూలు జిల్లాలోని డీఆర్‌డీవో ద్వారా డ్రోన నుంచి మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయో గించడంపై సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తంచేశారు. భారతదేశ రక్షణ పర్యావ రణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశకు గర్వంగా ఉందని కొనియాడారు. క్షిపణి పరీక్ష విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు. దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన ముందడుగు అని చంద్రబాబు అభివర్ణించారు. యూఎల్‌ిపీజీ-వీ3 విజయం ఆత్మనిర్భర్ భారత నిజమైన స్పూర్తిని ప్రతిబింబిస్తోందని అన్నారు.
ఏపీకి మరో ఘనత: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు మండలంలోని డీఆర్‌డీవో నిర్వహించిన క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం రాషా్ట్రనికి మరో ఘనత సాధించి పెట్టిందన్నారు. గతంలోనూ దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికైన క్షిపణితో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని యుద్ధ ట్యాంకును ధ్వంసం చేసే ప్రయోగాన్ని డీఆర్‌డీవో విజయవంతంగా పూర్తిచేసిందన్నారు. డీఆర్‌డీఓతో పాటు, అనుబంధ రక్షణ సంస్థల శాస్త్రవేత్తలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
పాలకొలనుకు జాతీయ స్థాయిలో గుర్తింపు
పాలకొలను సమీపంలో ఏర్పాటు చేసిన డీఆర్‌డీవో సంస్థ ద్వారా గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. డీఆర్‌డీవో ద్వారా నిర్వహించిన క్షిపణుల ప్రయోగాలన్నీ విజయవంత ం కావడం హర్షించదగ్గ విషయం. సంస్థ ఏర్పాటుకు సాగు భూములిచ్చిన గ్రామ రైతులందరికీ కృతజ్ఞతలు.
Updated Date - Jul 25 , 2025 | 11:50 PM