Minister: సన్నరకాల ధాన్యం పండించేలా రైతులకు ప్రోత్సాహం
ABN, Publish Date - Jun 21 , 2025 | 05:09 AM
ప్రజలు కోరుకుంటున్న సన్న బియ్యం వినియోగాన్ని ప్రభు త్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రైస్ మిల్లర్లతో భేటీలో మంత్రి మనోహర్
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ప్రజలు కోరుకుంటున్న సన్న బియ్యం వినియోగాన్ని ప్రభు త్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఎక్కువ విస్తీర్ణంలో సన్నరకాల ధాన్యం పండించేలా రైసు మిల్లర్లు కూడా ప్రోత్సహించాలని కోరారు. విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లో శుక్రవా రం రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా.. రైతులకు లాభం చేకూరేలా మిల్లర్లు సమష్టిగా పని చేయాలని కోరారు.
ముందుగానే వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ
65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతినెలా 25 నుంచి 30వ తేదీ లోపే రేషన్ సరుకులను డోర్ డెలివరీని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకుముందు ప్రతినెలా 1 నుంచి 5వ తేదీలోపు ఇవ్వాల ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏకకాలంలో సాధారణ కార్డుదారులకు రేషన్ షాపుల వద్ద సరుకులు పంపిణీ చేయడం, వృద్ధులు, దివ్యాంగులకు డోర్‌డెలివరీ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే 30వ తేదీలోపే వారికి డోర్‌డెలివరీ పూర్తిచేయాలని డీలర్లను మంత్రి మనోహర్ ఆదేశించారు.
Updated Date - Jun 21 , 2025 | 06:32 AM