అడ్డంగా దొరికిపోయారు: మంత్రి డోలా
ABN, Publish Date - Aug 04 , 2025 | 05:09 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి స్కీమూ ఓ పెద్ద స్కామ్ అని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు.
అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి స్కీమూ ఓ పెద్ద స్కామ్ అని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికిపోయి కూడా జగన్ అండ్ కో అడ్డగోలుగా బుకాయిస్తున్నారన్నారు. నాసిరకం మద్యంతో పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన పాపం ఊరికే పోతుందా? అని ప్రశ్నించారు. పేదల కష్టాన్ని కరెన్సీ కట్టలుగా మార్చుకుని డెన్‌లలో దాచుకున్నారని, ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో నిందితుల అరెస్టులతో కల్తీ మద్యంతో చనిపోయిన వారి కుటుంబాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. తప్పు చేసిన వారెవరూ చట్టం చేతుల్లో నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
Updated Date - Aug 04 , 2025 | 05:10 AM