ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister BC Janardhan Reddy : రోడ్లకు 1,149 కోట్ల నాబార్డు నిధులు

ABN, Publish Date - Jan 28 , 2025 | 05:51 AM

ఎన్‌డీబీ పథకం కింద చేపట్టిన రోడ్ల పనులను సోమవారం ఆయన పరిశీలించి, ఏలూరు జిల్లా రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

  • 10,200 కిలోమీటర్ల స్టేట్‌ హైవేల అభివృద్ధికి డీపీఆర్‌ సిద్ధం

  • ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్దనరెడ్డి

ఏలూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గుంతలు పూడ్చడానికి అవకాశం లేని 12,274 కిలోమీటర్ల రహదారులను నాబార్డు నిధులు రూ.1,149 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి వెల్లడించారు. ఎన్‌డీబీ పథకం కింద చేపట్టిన రోడ్ల పనులను సోమవారం ఆయన పరిశీలించి, ఏలూరు జిల్లా రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆర్‌అండ్‌బీ రోడ్లను తాము అధికారంలోకి వచ్చిన 180 రోజుల్లో పూర్తి చేశాం. గత ప్రభుత్వం రహదారులకు రూ.16,852 కోట్లు కేటాయించి రూ.7,334 కోట్ల మాత్రమే ఖర్చు చేసింది. అందులో మళ్లీ తిరిగి రూ.2,300కోట్ల బకాయిలు పెట్టింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రూ.1,080కోట్లతో 52 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేశాం. ఇందులో 65 శాతం పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాం. వర్షాల కారణంగా అలస్యమైనవి, మిగిలినవి ఫిబ్రవరిలోగా పూర్తి చేస్తాం. 180 రోజుల్లో 21,220 కిలోమీటర్ల మేర గుంతలు పడిన రహదారులపై సజావుగా రాకపోకలు సాగించడానికి పరిశ్రమలకు, పర్యాటకానికి అనువుగా అన్ని విఽధాలుగా మరమ్మతులు చేపట్టాం. వైసీపీ హయాంలో చేత కాక వదిలేసిన 12,653 కిలోమీటర్లలో 10,200 కిలోమీటర్ల స్టేట్‌ హైవేలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయడానికి డీపీఆర్‌ సిద్ధం చేశాం. రూ.47 కోట్లతో కాంట్రాక్టు ఏజెన్సీని ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలకు అనువుగా జంగిల్‌ క్లియరెన్స్‌కు రూ.33 కోట్లు ఖర్చు చేశాం. ఏలూరు నగరంలోని శనివారపుపేట కాజ్‌ వే వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేశాం. త్వరలో టెండర్లు పిలుస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, బడేటి రాధాకృష్ణయ్య(చంటి), ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:51 AM