ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kodandarama Brahmotsavam: సమన్వయంతో ఒంటిమిట్ట ఉత్సవాలు

ABN, Publish Date - Apr 08 , 2025 | 04:43 AM

కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు జరిగింది.

హంసవాహనంపై దర్శనమిచ్చిన కోదండరాముడు

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు, టీటీడీ అఽధికారులు సమన్వయంతో కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలన సమావేశ భవనంలో, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈనెల 11న సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. కాగా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి స్వామివారు హంస వాహనంపై ఊరేగారు.

Updated Date - Apr 08 , 2025 | 04:43 AM