ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంతత

ABN, Publish Date - May 18 , 2025 | 01:26 AM

మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానంతో ఒత్తిడిని తట్టుకొని రక్తపోటుని నివారించుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు.

కలెక్టరేట్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానంతో ఒత్తిడిని తట్టుకొని రక్తపోటుని నివారించుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రక్తపోటు శిబిరాన్ని కలెక్టర్‌ లక్ష్మీశ ప్రారంభించి రక్తపోటు పరీక్షలను చేయించుకొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల నియంత్రణ, శారీరక వ్యాయాయం, మానసిక ప్రశాంతత చేకూర్చే యోగాసనాలు, ధ్యానం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి శ్రీనివాసరెడ్డి, వివిధ విభాగాల పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 01:26 AM