ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Support: కొత్త సైకిల్‌ వచ్చిందోచ్‌

ABN, Publish Date - Jul 12 , 2025 | 05:49 AM

మెగా పీటీఎం 2.0 కార్యక్రమం నలుగురు చిన్నారులకు సంతోషాన్ని మిగిల్చింది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి చెందిన మాధవి కుమారుడు, ముగ్గురు కుమార్తెలకు సీఎం చంద్రబాబు...

  • మెగా పీటీఎంలో మాటిచ్చిన సీఎం చంద్రబాబు

  • నలుగురు చిన్నారులకు కొనిచ్చిన అధికారులు

కొత్తచెరువు, జూలై 11(ఆంధ్రజ్యోతి): మెగా పీటీఎం 2.0 కార్యక్రమం నలుగురు చిన్నారులకు సంతోషాన్ని మిగిల్చింది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి చెందిన మాధవి కుమారుడు, ముగ్గురు కుమార్తెలకు సీఎం చంద్రబాబు హామీతో కొత్త సైకిళ్లు కానుకగా లభించాయి. గురువారం కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం 2.0లో మాధవి, ఆమె పిల్లలతో సీఎం, మంత్రి లోకేశ్‌ ముఖాముఖిగా మాట్లాడి, వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. తన కుమారుడి ఆరోగ్యం బాగా లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, నలుగురు బిడ్డలను చదివించే బాధ్యత తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మూడో తరగతి చదువుతున్న ఆమె చిన్న కుమార్తె సనను సీఎం పలకరించారు. ‘నీకేం కావాలి?’ అని అడిగారు. తనకు సైకిల్‌ కావాలని సన కోరడంతో నలుగురికీ సైకిళ్లు కొనివ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో ధర్మవరం తహసీల్దారు సురేశ్‌ సమక్షంలో శుక్రవారం నలుగురికీ కొత్త సైకిళ్లను అందజేశారు. మాధవి, ఆమె భర్త నరసింహుడు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 12 , 2025 | 09:31 AM