Anakapalli : మెట్రోకెమ్ ఫార్మాలో అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Jan 22 , 2025 | 05:09 AM
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని మెట్రో కెమ్ ప్రైవేటు లిమిటెడ్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దెబ్బతిన్న ఈటీపీ భవనం, రూ.లక్షల్లో ఆస్తి నష్టం
పరవాడ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని మెట్రో కెమ్ ప్రైవేటు లిమిటెడ్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కంపెనీలోని ఎప్లూయింట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఈటీపీ) భవనం మూడో అంతస్థులో గోనె సంచులు, డ్రమ్ములు, ఇతర వ్యర్థాలు నిల్వ చేస్తారు. రెండు నుంచి మూడు టన్నులు కాగానే వాటిని విక్రయిస్తుంటారు. మంగళవారం ఉదయం 6.15 గంటల సమయంలో నిల్వ ఉంచిన వ్యర్థాల నుంచి మంటలు రాజుకున్నాయి. రసాయన వ్యర్థాలు కావడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో రాంకీ అగ్నిమాపక శకటంతో పాటు అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. వ్యర్థాలు రాపిడికి గురై మంటలు వ్యాపించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలం వద్ద కార్మికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటలకు భవనం పాక్షికంగా దెబ్బతింది. రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. గతేడాది నవంబరు రెండవ తేదీన ఇదే కంపెనీలో రియాక్టర్ మ్యాన్‌హోల్ తెరుచుకోవడంతో ప్రొడక్షన్ బ్లాక్‌లో పెద్దపేలుడు సంభవించింది. అయితే ఆరోజు కూడా కార్మికులెవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 05:10 AM