ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: వంద రోజుల్లో రోడ్లపై గుంతల్లేని మంగళగిరి

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:15 AM

వంద రోజుల్లో రోడ్లపై గుంతల్లేని నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని, అధికారులు దీన్ని చాలెంజ్‌గా తీసుకుని పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఆదేశించారు.

  • అధికారులు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలి: మంత్రి లోకేశ్‌

తాడేపల్లి (ఉండవల్లి), జూలై 14(ఆంధ్రజ్యోతి): వంద రోజుల్లో రోడ్లపై గుంతల్లేని నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని, అధికారులు దీన్ని చాలెంజ్‌గా తీసుకుని పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంటీఎంసీ)ను స్వచ్ఛతలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేలా రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను మంత్రి సోమవారం ఉండవల్లిలోని తన నివాసం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. చెత్త తరలించేందుకు రెండు రిఫ్యూజ్‌ కాంపాక్టర్‌ మిషన్‌ వాహనాలు, రెండు స్వీపింగ్‌ మిషన్‌ వాహనాలతోపాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్‌హోల్‌ రోడ్‌ రిపేర్‌ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. చెత్త తరలించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్‌ వాహనాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎంటీఎంసీకి అందాయి. రూ.1.48 కోట్ల విలువైన పాత్‌హోల్‌ రోడ్‌ రిపేర్‌ వాహనంతోపాటు రూ.1.2 కోట్ల విలువైన రెండు స్వీపింగ్‌ మిషన్లూ వచ్చాయి. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి, ఎంటీఎంసీ కమిషనర్‌ అలీం బాషా, ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 05:16 AM