Mangalam Birla: అమరావతిలో బిట్స్ క్యాంపస్
ABN, Publish Date - Jul 14 , 2025 | 03:45 AM
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు.
35 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో ఏర్పాటు
2027 నుంచి అందుబాటులోకి: బిర్లా
గుంటూరు, జూలై 13(ఆంధ్రజ్యోతి): బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు.రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.ఆదివారం ఆయన రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఆడిటోరియంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో విద్యార్థులు,సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ (ఏఐ ప్లస్) క్యాంపస్‌ను రెండు దశల్లో దాదాపు 7వేల మంది విద్యార్థుల విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా నిర్మించనున్నామని తెలిపారు.2027 నాటికి ఇది పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. 35 ఎకరాల్లో నిర్మించనున్న ఈ కొత్త క్యాంపస్ ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్,కంప్యూటేషనల్ లింగ్విస్టిక్ట్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ బ్రాంచ్‌ల్లో అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను అందిస్తుందని వివరించారు. దీనితో పాటు బిట్స్ సామర్థ్యం పెంచడం, ఏఐని అందిపుచ్చుకోవడంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో మూడు ముఖ్యమైన ప్రణాళికలను ఆయన ప్రకటించారు.భారత్‌లోని క్యాంప్‌సల విస్తరణకు ‘బిట్స్ విస్తార్’ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. బిట్స్‌లో విద్యార్థుల సంఖ్యను 18,700 నుంచి 26 వేలకు పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు.
Updated Date - Jul 14 , 2025 | 03:48 AM