ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌కు షరతులతో బెయిల్‌

ABN, Publish Date - Jul 08 , 2025 | 04:51 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడటంతో పాటు నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారంలో క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌(ఏ2)కు హైకోర్టు పలు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడటంతో పాటు నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారంలో క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌(ఏ2)కు హైకోర్టు పలు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. చార్జ్‌షీట్‌ దాఖలు చేసేంత వరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఏదో ఒక సమయంలో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని సూచించింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనం వ్యవహారంలో విజయవాడ సూర్యారావుపేట పోలీసులు మధుసూదన్‌పై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు(ఏ1)ను పోలీసులు నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 08 , 2025 | 04:52 AM