ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Mahanadu: తెలుగుజాతి విశ్వఖ్యాతి తీర్మానం ఆమోదం

ABN, Publish Date - May 29 , 2025 | 04:31 AM

తెలుగుజాతికి విశ్వవ్యాప్త గుర్తింపు కల్పించే దిశగా టీడీపీ మహానాడులో ఆరవ శాసనాన్ని బుధవారం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని నక్కా ఆనంద్‌బాబు ప్రవేశపెట్టగా, నన్నూరి నర్శిరెడ్డి బలపరిచారు.

లోకేశ్‌ ప్రవేశపెట్టిన ఆరో శాసనంపై చర్చ

కడప, మే 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తొలిరోజు మంగళవారం మహానాడులో ఆరు శాసనాలను ప్రతిపాదించారు. అందులో ఐదింటిపై తొలిరోజే తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదించారు. ఆరో శాసనం ‘తెలుగుజాతి-విశ్వఖ్యాతి’ అంశాన్ని రెండోరోజు బుధవారం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ప్రవేశపెట్టగా, టీటీడీ బోర్డు మెంబరు, తెలంగాణ నేత నన్నూరి నర్శిరెడ్డి ఆమోదించారు.

తెలుగు జాతికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి: ఆనంద్‌బాబు

‘తెలుగు జాతికి, భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. చంద్రబాబు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి సాంకేతిక, ఐటీ రంగాల్ని ప్రోత్సహించారు. ఇంజనీరింగ్‌ కాలేజీలు ప్రవేశపెట్టి సాఫ్ట్‌వేర్‌ రంగానికి బాటలు వేశారు. హైదరాబాద్‌ను సిలికాన్‌ వ్యాలీగా తీర్చిదిద్ది, హైటెక్‌సిటీ నిర్మాణం చేపట్టి మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చారు. బిల్‌గేట్స్‌, బిల్‌ క్లింటన్‌, టోని బ్లెయర్‌ను తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. తండ్రి ఆశయాలకు అనుగుణంగా లోకేశ్‌ ఆధ్వర్యంలో తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తారని ఆశిస్తున్నా.’


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 03:07 PM