ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పునాదులకే పరిమితం

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:00 AM

మండలంలో వెలెనెస్‌, రైతు భరోసా కేంద్రాల పనులు పలుచోట్ల పునాదులకే పరిమిత మయ్యాయి.

శ్రీరంగాపురంలో పునాదులకే పరిమితమైన రైతు భరోసా కేంద్రం

· ముందుకు సాగని వెల్‌నెస్‌,

రైతుభరోసా కేంద్రాల నిర్మాణ పనులు

· తుప్పుపట్టిన ఇనుప కడ్డీలు

· పలుచోట్ల పెరిగిన పిచ్చి మొక్కలు

· బిల్లులు అందక ఆపేసిన కాంట్రాక్టర్లు

రుద్రవరం, జూన 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో వెలెనెస్‌, రైతు భరోసా కేంద్రాల పనులు పలుచోట్ల పునాదులకే పరిమిత మయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఆర్భా టం తప్ప రైతులకు సేవలందించేందుకు నిర్మి స్తున్న పనులను నిర్లక్ష్యంగా వదిలేశారు. రుద్రవరంలో రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ కేంద్రం, శ్రీరంగాపురంలో వెల్‌నెస్‌ కేంద్రం, రైతు భరోసా కేంద్రం, పెద ్దకంబలూరు, చి న్నకంబలూరు, మందలూరులో రైతు భరో సా కేంద్రాల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.

పేరూరులో రైతుభరోసా, వెల్‌నెస్‌ కేంద్రం, నా గులవరం రైతు భరోసా కేం ద్రం పనులు నిలిచిపో యాయి. బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలి పివేశారు. కొన్ని గ్రామాల్లో పునాదులకు నిర్మించిన ఇనుప కడ్డీలు తుప్పుబ ట్టాయి. మరికొన్ని గ్రామాల్లో పునాదుల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. ఈవిషయంపై పంచాయతీరాజ్‌ ఈఈ కమాల్‌సాబ్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నిలిచిన రైతు భరోసాకేంద్రం, వెల్‌నెస్‌ కేంద్రాల పై నివేదికలు ఉన్నతాధికారులకు పంపించాం. ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభించి పనులు పూర్తి చేస్తాం.

Updated Date - Jun 10 , 2025 | 12:00 AM