APPSC: జూలై 15 నుంచి లెక్చరర్ పోస్టులకు పరీక్షలు
ABN, Publish Date - Jun 13 , 2025 | 05:36 AM
పాలిటెక్నిక్ లెక్చరర్లు(99), జూనియర్ లెక్చరర్లు(47), డిగ్రీ లెక్చరర్లు(240), టీటీడీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షల కొత్త షెడ్యూలును ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఏపీపీఎస్సీ కొత్త షెడ్యూలు విడుదల
అమరావతి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ లెక్చరర్లు(99), జూనియర్ లెక్చరర్లు(47), డిగ్రీ లెక్చరర్లు(240), టీటీడీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షల కొత్త షెడ్యూలును ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది. జూలై 23తో పరీక్షలు ముగుస్తాయని పేర్కొంది. అన్ని పోస్టులకూ.. కొన్ని పేపర్లు ఒకేవిధంగా ఉంటాయని తెలిపింది. కాగా, టీటీడీ డిగ్రీ కాలేజీలో భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ రాత పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుంది. అనంతరం భర్తీ ప్రక్రియ టీటీడీ చేపడుతుంది.
Updated Date - Jun 13 , 2025 | 05:44 AM