ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుంజేద్దాం

ABN, Publish Date - May 15 , 2025 | 01:10 AM

చిన్నతరహా ఖనిజాలు, గనులు, క్వారీలు, లేటరైట్‌, ఇతర గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి గనులశాఖ ఎన్నో ఏళ్లుగా సీనరేజీ వసూలు చేసేది. తద్వారా ప్రభుత్వానికి ఏటా కోట్లలో ఆదాయం వచ్చేది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ సీనరేజీ వసూలు బాధ్యతల నుంచి గనులశాఖను తప్పించేసింది.

గుంజేద్దాం

  • ఉమ్మడి తూ.గో. జిల్లాలో సుధాకర్‌ ఇన్‌ఫ్రా అడ్డగోలు సీనరేజీ దోపిడీ

  • కాంట్రాక్టు గడువు రెండు నెలలే ఉండడంతో కాసుల కోసం బరితెగింపు

  • ఉన్న సమయంలో కోట్లు వెనకేసుకునేలా సీనరేజీ సాకుతో ఎడాపెడా వసూళ్లు

  • చెరువులు, పొలాల్లో మట్టి తవ్వుకునే రైతులు, పేదలకూ మినహాయింపు లేదు

  • మట్టి తవ్వకానికి కేబినెట్‌ అనుమతిచ్చినా ఖాతరు చేయకుండా సీనరేజీ దందా

  • అనేకచోట్ల రసీదులు సైతం ఇవ్వకుండా కంపెనీ పేరుతో సిబ్బంది నగదు వసూళ్లు

  • రౌతులపూడిలో సీనరేజీ పేరుతో దందా చేస్తుండడంపై తిరగబడ్డ లారీ యూనియన్‌

  • అంబాజీపేటలో మట్టి ట్రాక్టర్ల నుంచీ పన్ను వసూలుపై తిరగబడ్డ స్థానికులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుధాకర్‌ ఇన్‌ఫ్రా సంస్థ సీనరేజీ పేరుతో ఎడాపెడా దండేస్తోంది.. ఎక్కడికక్కడ జనం ముక్కుపిండి అడ్డగోలుగా దోచేస్తోంది.. సొంత పొలం.. చెరువుల్లోంచి రైతులు, స్థానికులు తట్టెడు మట్టి తీసుకువెళ్తున్నా వాలిపోతోంది.. సీనరేజీ ఫీజులు కట్టాలంటూ రుబాబు చేస్తోంది. ఒకపక్క వాణిజ్యేతర అవసరాలకు రైతులు చెరువుల నుంచి మట్టి తీసుకువెళ్లడానికి ఇటీవల కేబినెట్‌ అనుమతిచ్చినా తనకేం సంబంధం లేదన్నట్టు దందా చేస్తోంది. ఇంకో రెండు నెలల్లో సంస్థ కాంట్రాక్టు ముగియనున్న నేపథ్యంలో ఈలోపే కోట్లకు కోట్లు దండేసేందుకు బరితెగించేస్తోంది. అనేకచోట్ల రేయింబవళ్లు కంపెనీ పేరుతో సిబ్బంది సీనరేజీ పేరుతో రసీదులు సైతం లేకుండా నగదు వసూలు చేస్తుండడంతో పలుచోట్ల జనం తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం 2023లో ఉమ్మడి జిల్లాలో చిన్న తరహా ఖనిజాల సీనరేజీ వసూలు బాధ్యతల నుంచి గనులశాఖన తప్పించి సుధాకర్‌ ఇన్‌ఫ్రాకు అడ్డగోలుగా కట్టబెట్టింది. రెండేళ్ల వ్యవధిలో రూ.223 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలనే నెపంతో ఎక్కడికక్కడ పిండేసింది. ప్రభుత్వం మారాక 73 రోజులు కాంట్రాక్టు గడువు పెంచడంతో దందా కొనసాగిస్తోంది.

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

చిన్నతరహా ఖనిజాలు, గనులు, క్వారీలు, లేటరైట్‌, ఇతర గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి గనులశాఖ ఎన్నో ఏళ్లుగా సీనరేజీ వసూలు చేసేది. తద్వారా ప్రభుత్వానికి ఏటా కోట్లలో ఆదాయం వచ్చేది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ సీనరేజీ వసూలు బాధ్యతల నుంచి గనులశాఖను తప్పించేసింది. వీటినుంచి భారీగా నిధులు బొక్కేయడం కోసం పథకం పన్ని ఏకంగా ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టింది. ఎవరికి తెలియకుండా అడ్డగోలుగా 2023 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో చిన్న తరహా ఖనిజాల సీనిరేజీ వసూలు కాంట్రాక్టును ఏకంగా సుధాకర్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి అప్పగించేసింది. రెండేళ్లపాటు ఈ కాంట్రాక్టు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగాను రెండేళ్లకు ప్రభుత్వానికి రూ.233 కోట్లు చెల్లించేసి ఆపై ఎంత వసూ లు చేసుకున్నా తనకు సంబంధం లేదన్నట్టు స్పష్టం చేసింది. పైగా రూ.233 కోట్లు ఒకేసారి కాకుండా నెలకు రూ.9.70కోట్ల చొప్పున ప్రభుత్వానికి కట్టేలా వెసులుబాటు కల్పించింది. సదరు కంపెనీ వెనుక ఉన్న ఓ కీలక వైసీపీ నేత చేతికి అధికారం దక్కడంతో రెచ్చిపోయారు. ఉమ్మడి జిల్లాలో క్వారీలు, మైనింగ్‌ జరిగే ప్రాంతాలు, చెరువులు, కొండలు ఉన్నచోట్ల ఏకంగా భారీగా చెక్‌పోస్టులు ఏర్పా టుచేసి ప్రైవేటు సైన్యాన్ని దింపి ప్రతి లారీనుంచి ముక్కుపిండి సీనరేజీని ఈ కంపెనీ వసూలుచేసింది. ఈ కంపెనీ రాకముందు నెలకు ఉమ్మడి జిల్లాలో గనుల శాఖకు పర్యవేక్షణ లేక, సిబ్బంది కొరతతో పట్టించుకోక రూ.3 కోట్లు కూడా వచ్చేది కాదు. కానీ సదరు ప్రైవేటు సంస్థ ఏకంగా ముక్కుపిండి నెలకు రూ.15కోట్ల వరకు పిండేసింది. ఇలా గతేడాది అసెంబ్లీ ఫలితాలు వచ్చేవ రకు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు రెచ్చిపోయి ఉమ్మడి జిల్లాను కుమ్మేసింది. కోట్లకుకోట్ల సీనరేజీ పిండేసింది. గతేడాది అసెం బ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఈ సంస్థ ఆగడాలు ఆగినట్టేనని అంతా భావించారు. అప్పటి ప్రభుత్వం అడ్డగోలుగా కట్టబెట్టిన కాంట్రాక్ట రద్దవడం ఖాయం అని అనుకున్నారు. సుధాకర్‌ ఇన్‌ఫ్రా సైతం ప్రభుత్వం మా రడంతో భయపడి తగ్గింది. మే, జూన్‌, జూలై నెలల్లో ఉమ్మడి జిల్లాలో సీనరేజీ వసూళ్లు నిలిపివేసింది. కానీ మళ్లీ అదే కంపెనీ పైరవీలు నడిపింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మూడు నెలలపాటు సీనరేజీ వసూళ్లు నిలిపివేసినందున ఆ సమయానికి తమకు సీనరేజీ వసూలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అటు ప్రభుత్వానికి సీనరేజీ బాకీలు కూడా ఉండడంతో అవి చెల్లించడానికి గడువు పొడిగించాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈనెల నుంచి జూలై 14 వరకు 73రోజులపాటు సీనరేజీ వసూలు చేసుకునేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై 14 తర్వాత కాంట్రాక్టు రద్దవుతుందని స్పష్టం చేసింది.

గడువులోగా కుమ్మేద్దాం..

పొడిగించిన గడువు మరో రెండు నెలల్లో ముగియ నుండడంతో సుధాకర్‌ ఇన్‌ఫ్రా ఇప్పుడు అడ్డగోలుగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో బరితెగిం చేస్తోంది. ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ పిండేసేం దుకు వీలుగా దౌర్జన్యాలకు తెగబడుతోంది. ఎక్కడికక్కడ కంపెనీ పేరుతో సిబ్బంది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాహనాల్లో తిరుగుతూ డబ్బులు కట్టాలంటూ చెరువులు, కాలువలు, కొండలు, గుట్టల వద్ద దందాలు చేస్తున్నారు. చేతిలో కనీసం రసీదు పుస్తకం కూడా లేకుండా నగదు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల రౌతులపూడిలో కొండల నుంచి గ్రావెల్‌ తరలిస్తోన్న లారీలను సుధాకర్‌ ఇన్‌ఫ్రా పేరుతో కొందరు ఆపి డబ్బులు డిమాండ్‌ చేశారు. రసీ దులు లేకుండా డబ్బులు అడుగుతున్నారని లారీ యూ నియన్‌ తిరగబడడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, రౌతులపూడి, పెద్దాపురం మండలాల్లో చిన్నాచితకా క్వారీల నుంచి నల్లరాయి, గ్రావెల్‌, తూర్పుగోదావరిలో కొండల నుంచి చిన్నపాటి గ్రావెల్‌, మట్టి... కోనసీమలో చెరువులనుంచి మట్టి తర లిస్తున్న వారిని సైతం వదలకుండా నగదు డిమాండ్‌ చేస్తుండడంతో సదరు కంపెనీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం బిల్లులు లేకుండా అడ్డ దారిలో డబ్బులు వసూలు చేయడం ఏస్థాయిలో సీన రేజీ పేరుతో సదరు సంస్థ కోట్లకుకోట్లు దారిమళ్లిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు రైతులు వాణిజ్యేతర అవసరాలు చెరువుల్లో మట్టి తవ్వి తరలించుకోవచ్చని ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయినా ఈ కంపెనీ మాత్రం తనకు డబ్బు కట్టాల్సిందేనంటూ బరి తెగించేస్తోంది.

ఆ రూ.24 కోట్ల పేరుతోను..

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో అరబిందో సంస్థకు గత వైసీపీ ప్రభుత్వం ఓ కొండను రాసిచ్చేసింది. కాకినాడ సెజ్‌లో నిర్మిస్తోన్న పోర్టు కోసం ఇక్కడి నుంచి కావలసినంత రాయిని తవ్వుకోవడానికి వీలుగా రూ.71 కోట్ల వరకు సీనరేజీ పన్ను రద్దు చేసేసింది. ఇలా చేయడం వల్ల తనకు రావలసిన ఆదాయానికి గండిపడిందని సదరు సుధాకర్‌ ఇన్‌ఫ్రా రూ.24కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేదు. తాను కట్టాల్సిన బాకీలో ఈ మొత్తం రద్దు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరింది. అయినా పట్టించుకోకపోవడంతో కొత్త ప్రభుత్వం వద్ద పైరవీలు చేసింది. వినకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మొత్తం డబ్బులు ఒకవేళ తాను కట్టాల్సివస్తే నష్టపోతామనే కారణంతో కాంట్రాక్టు మిగిలి ఉన్న ఈ రెండు నెలల్లో ఎంత వీలైతే అంత అడ్డగోలుగా పిండేయాలని సదరు సంస్థ పన్నాగం పన్నింది. అందుకే ఉమ్మడి జిల్లాల్లో సీనరేజీ పేరుతో నగదు వసూళ్లకు తెగబడుతోంది.

కోనసీమలోనూ అదే తీరు..

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సెస్‌ వసూలుకు వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు పొందిన సుధాకర్‌ ఇన్‌ఫ్రా సంస్థ పేరిట జరుగుతు న్న దందా విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల ఓ వివాదం పోలీసుస్టేషన్‌కూ చేరింది. పి.గన్నవరం మండలం నుంచి ఓ రైతుకు చెందిన పొలం నుంచి నల్లమట్టిని ట్రాక్టర్లపై అంబాజీపేట హైస్కూలుకు తరలిస్తుండగా వాటిని ఆపిన సుధాకర్‌ ఇన్‌ఫ్రా సిబ్బంది వారికి సొమ్ములు చెల్లించాలని డ్రైవర్లను అడిగారు. దాంతో డ్రైవర్లకు, సంస్థకు చెందిన వారికి మధ్య ఘర్షణ తలెత్తడంతోపాటు వారి ప్రైవేటు వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. ఆ ట్రాక్టర్ల డ్రైవర్లు, వాటి యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో తమ పొలంలో మట్టి తీసుకుని తరలిస్తే సెస్‌ ఎందుకు చెల్లించాలని రైతులు నిలదీస్తున్నారు.

Updated Date - May 15 , 2025 | 01:10 AM