కార్మిక హక్కులను రక్షించుకోవాలి
ABN, Publish Date - May 01 , 2025 | 11:41 PM
కార్మికు ల హక్కులను పరిరక్షించాలంటూ కార్మిక సం ఘాల నాయకులు ప్రభుత్వాలను కోరారు.
ప్రొద్దుటూరు/టౌన/అర్బన మే 1 (ఆంధ్రజ్యోతి):కార్మికు ల హక్కులను పరిరక్షించాలంటూ కార్మిక సం ఘాల నాయకులు ప్రభుత్వాలను కోరారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీఎన టీయూసీ పాటు పడుతుందని ఆ సంసఽ్ధ జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీనలు తెలిపా రు. గురువారం స్ధానిక టీడీపీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్బంగా టీఎనటీయూసీ జెండాను ఆవిష్క రించారు. టీడీపీ ప్రభుత్వం కార్మికుల భీమా సౌకర్యంతో పాటు సంక్షేమ పధకాలు అమల య్యేలా కృషి చేస్తుందన్నారు. అసంఘటిత కార్మి కులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, వాల్మీకి బోయ కార్పొరేషన స్టేట్ డైరెక్టర్ నల్లబో తుల నాగరాజు, టౌన బ్యాంక్ చైర్మన బొగ్గుల సుబ్బారెడ్డి, నంద్యాల ఆనంద బార్గవరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, ,మాజీ పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వ ర్లు. కౌన్సిలర్ కమాల్, మాజీ కౌన్సిల్లర్ అంజి, నూరి, సిద్దయ్య, పాల్గొన్నారు. కాగా మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులకోసం పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సుబ్బరాయుడు పేర్కొన్నారు. గురువారం మేడే సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద, ఆర్టీసీ బస్టాండు ఆవరణలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మేడే సందర్భంగా పుట్టపర్తి సర్కిల్‌లో విద్యుత్తు కార్యాలయం వద్ద జిల్లా ప్రభుత్వ కార్యాలయం వద్ద, పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద, పాత బస్టాండు వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణ, మధు, చైతన్య, నిర్మల, శ్రీను, నీలకంఠారెడ్డి, పీరా, రమణ పాల్గొన్నారు.
మే డే సందర్భంగా బైక్ మెకానిక్స్ వెల్‌ఫేర్ అసోసియేషన ఆధ్వర్యంలో రామేశ్వరంలోని సాయిబాబా గుడి వద్ద నుంచి ఆర్టిసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కార్మికుల ఐక్యత చాటుకున్నారు. పట్టణంలోని వందల మంది బైక్ మెకానిక్లు ర్యాలీ లో పాల్గొన్నారు.
జమ్మలమడుగులో: జమ్మలమడుగులో 139 మేడే వేడుకలను పురష్కరించుకుని ఆర్టీసీ బస్టాండు వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సీనియర్ నాయకులు గంగిరెడ్డి జెండా ఎగురవేశారు. అలాగే పాత బస్టాండు ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహం పక్కన ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు దండు రవి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పట్టణ నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న 8 గంటల పని విధానాన్నే కొనసాగించాలని లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని ప్రభుత్వ సంస్థలు ప్రైవేటుపరం తగదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ, కార్మిక నాయకులు ప్రతాప్, గంగాధర్, రాజేష్, నాగేంద్ర, లాల్‌బాష, సుబాన్, సంతోష్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కుమారి, సంపూర్ణ, ఉషా పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో దాసరి విజయ్, ఆటో కార్మికులు జెండా ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు.
ఎర్రగుంట్లలో: కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 8 గంటల పని విధానం కొనసా గించాలని ఏఐటీయూసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య. డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా ఎర్రగుంట్లలో ఏఐటీయూసీ ఆధ్వ ర్చ్యంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ 14గంట లు పనిచేయించుకుంటూ శ్రమదోపిడీకి పాల్ప డుతున్నారని ధ్వజమెత్తారు. అంతార్జాతీయ కార్మిక సంస్థ కనీస వేతనం రూ.26వేలు చెల్లిం చాలని చెప్పినప్పటికి అమలు చేయడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సుబ్బారెడ్డి, మంజుల, చాంద్‌బాషా, డి.రమణారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు రూరల్‌లో: మైదుకూరులో మే డే దినోత్సవాన్ని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ్ఖశ్రీరాములు, నియోజకవర్గ కార్యదర్శి శివరాం ఆద్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక మున్సిపాలిటీ వద్ద, ఆర్‌టీసీ బస్టాండ్ ఆవర ణలో ఆటో యూనియన్, ఎంప్లాయీస్ యూని యన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి వేడుక లు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పీరయ్య, ఖాదర్‌బాషా,మాబు హుసేన్, చిన్న, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
మైలవరంలో: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకుని మైలవరం నాలుగు రోడ్ల కూడలిలో గురువారం సీఐటీయూసీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటరమణ, శ్రీనివాసులు, సీపీఐ కార్యదర్శి కృష్ణ, మునిరెడ్డి, ఏపీచేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు శివనారాయణ, మండల నేత కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
కొండాపురంలో: మేడే వేడుకలను కొండాపు రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు పతాకావిష్కరణ చేసి, కేక్ కట్‌చేసి ర్యాలీ నిర్వి హంచారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాన పనికి సమానవేతనం కల్పించాలని, వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దుచేయాలని కోరారు. కార్య క్రమంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు వెం కటరమణ, మనోహర్‌బాబు, సుబ్బారావు, తారా దేవి ,వైవీసుదర్శనరెడ్డి, వెంకటేష్, రామాంజనే యులు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
బద్వేలులో: మేడే వేడుకలను బద్వేలు పట్ట ణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎనిమిది గంటల పని హక్కు , పరిరక్షణ, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు కోరుతూ ఈ నెల 20న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దే శవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అఽధ్యక్షుడు వేణు, మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు వీరశేఖర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన పాల్గొన్నారు.
Updated Date - May 01 , 2025 | 11:41 PM