యువ డ్రంకర్లు...
ABN, Publish Date - May 24 , 2025 | 11:35 PM
పెద్దలు, పిల్లలు అంతా స్మార్ట్ ఫోన్లకు అల వాటు పడ్డారు. ఇందులో యువత మరి విపరీతంగా వాడి చెడు దోవ పడుతున్నారు.
పెరుగుతున్న నేర సంస్కృతి
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న యువత
ఒకే రోజు 100మంది కోర్టులో హాజరు
స్పెషల్ డ్రైవ్‌లో బయట పడుతున్న నేర చరిత్ర
ఈ ఏడాది ఏప్రిల్ వరకు 1271 కేసులు
నంద్యాల టౌన్, మే 24(ఆంధ్రజ్యోతి): పెద్దలు, పిల్లలు అంతా స్మార్ట్ ఫోన్లకు అల వాటు పడ్డారు. ఇందులో యువత మరి విపరీతంగా వాడి చెడు దోవ పడుతున్నారు. స్పోర్ట్సు బైకులు తీసుకుని మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నారు. తల్లిదండ్రులు వేల రూపాయలు ఖర్చులకు ఇవ్వడంతో వారు జల్సాలకు, వ్యసనాలకు బానిసలవుతున్నారు. గొడవలు, ఘర్షణలు చేసి చివరకు నేరాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
పిల్లలపై నిఘా ఏదీ..
పిల్లలపై ఉన్న ప్రేమ, మమకారంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తున్న కన్నవారు వారిపై కన్నేసి ఉంచాలి. పిల్లలు ఏం చేస్తున్నదీ ఆరాతీయాలి. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోతే నష్టపో తారు. వీలైనంత వరకు ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఏవైనా లోపాలు ఉంటే విద్యా సంస్థల యాజమాన్యాలకు ఫిర్యాదు చేయాలి.
బీరు తాగితే ఏం కాదనేది అపోహ మాత్రమే..!
సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు చెక్ చేసే మిషన్లు 30శాతం కంటే తక్కువగా వస్తే ఎటువంటి కేసు నమోదు కాదు. కానీ బీరులో అల్కాహాల్ శాతం తక్కువగా ఉంటుందని తాగి రోడ్డుపై తిరుగుతూ పోలీసులకు చిక్కుతున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కోర్టులో ఫైన్లు కట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. అయినా పిల్లల్లో మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే శని, ఆదివారాల్లో యువత మరింత ఎక్కువగా డ్రంకెన్ డైవ్ కేసుల్లో పట్టుబడుతున్నారు.
ఒకే రోజు కోర్టుకు 100 మంది కోర్టు
నంద్యాల జిల్లాలో గత నెల రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ప్రతి రోజు సుమారుగా 70 నుంచి 90 కేసులు కేవలం మద్యపానం కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా 80 శాతం మంది యువత ఉంటున్నారు. వీరు ఇలా ఉంటే తాగిన మైకంలో నేరాలు చేయడానికి పూర్తి అవకాశం ఉంది. ఇదంతా చేస్తున్న ఫైన్లు కట్టాలి, జైలుకు వెళ్తారు అన్నా భయం లేకుండా పోయింది. అయితే ఇటీవల కోర్టుకు ఫైన్లు కట్టడానికి ఏకంగా 100 మంది ఒకే రోజు రావడంతో జడ్జి సైతం ఆశ్చర్యపోయారు. మరోసారి మద్యం తాగి బండి నడిపితే ఏకంగా రూ. 10 వేలు జరిమానా వేయాలని చెప్పినట్లు సమాచారం.
ఇటీవల నంద్యాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా యువకుల నుంచి పిడిబాకులు బయట పడ్డాయి.
దేవనగర్, రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో యువత ఎక్కువగా అల్లర్లకు పాల్పడుతున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఎన్జీవో కాలనీ, గోపాల్ నగర్, పద్మావతి నగర్ వంటి ప్రాంతాల్లో రాత్రి సమయంలో సరియైున గస్తీ లేక అల్లర్లు జరుగుతున్నాయి.
బొమ్మలసత్రం విశ్వనగర్, ఎన్జీవో కాలనీల్లో యువత ఎక్కువగా బెట్టింగులకు పాల్పడుతున్నారు. పోలీసులకు తెలిసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
Updated Date - May 24 , 2025 | 11:35 PM