రహ'దారుణాలు'
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:19 AM
పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో రహదారులు సరిగాలేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.
ఆదోని అగ్రికల్చర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో రహదారులు సరిగాలేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. నల్ల గేటు నుంచి మార్కెట్ యార్డు మీదుగా వెళ్లే బసాపురం రహదారి గుంతలమయంగా మారింది. నడిచేందుకు కూడా వీలు లేకుండా ఉందనని పాదచారులు అటున్నారు. ఈ రహదారిలోనే మార్కెట్‌యార్డు, పరిశ్రమలకు వాహనాలు వెళుతుంటాయి. అలాగే రైతులు వ్యవసాయ ఉత్పత్తులను వాహనా ల్లో ఇదే దారిమీదుగా తరలిస్తారు. ఇటీవల వర్షం కురవడంలో ఆనీరు నిలబడి మోకాళ్లలోతు గుంతలు పడ్డాయి. రాత్రిళ్లు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్‌ఆండ్‌బీ అధికారులు స్పందించి, నూతన రహదారి నిర్మించాలని వాహనదారులు, రైతులు కోరుతున్నారు.
Updated Date - Jul 14 , 2025 | 12:19 AM