ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:45 AM

విశాఖ ఉక్కు పరిశ్ర మలో తొలగించిన 2500 కార్మికులకు విధుల్లోకి తీసుకోవాలని కాం టాక్టు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న మునెప్ప

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప

కాంట్రాక్టు కార్మిక సంఘాల ప్రదర్శన, ధర్నా

కర్నూలు న్యూసిటీ, జూన 9(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు పరిశ్ర మలో తొలగించిన 2500 కార్మికులకు విధుల్లోకి తీసుకోవాలని కాం టాక్టు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు ఎస్‌.మునెప్ప, ఎండీ అంజిబాబు మాట్లాడుతూ గత నెల 20 నుంచి విశాఖ ఉక్కు కార్మి కులు చేస్తున్న సమ్మెను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్ర బాబు, ఉపముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవే టుపరం చేయించామని వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. తొల గించిన కార్మికులకు విధులోకి తీసుకోవాలని, పెండింగ్‌ జీతాలు చెల్లిం చాలన్నారు. కార్యక్రమంలో ఐఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు బతుకన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు భాస్కర్‌, ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సీఐటీయూ నగర కార్యదర్శి సాయి బాబా పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:45 AM