నాణ్యత ఉంటే కొనుగోలు చేస్తాం
ABN, Publish Date - May 20 , 2025 | 12:42 AM
జొన్నలు నాణ్యమైనవిగా ఉంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ బి. నవ్య హామీ ఇచ్చారు.
ఆదోని/ఆదోని రూరల్, మే 19 (ఆంధ్రజ్యోతి): జొన్నలు నాణ్యమైనవిగా ఉంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ బి. నవ్య హామీ ఇచ్చారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ్, అగ్రికల్చర్ ఏడీఏ బాలవర్థరాజు, ఏవో ఆశోక్ కుమార్‌రెడ్డి, తహసీల్దార్ శివరాముడుతో కలిసి 104 బసాపురంలో పర్యటించారు. జొన్న పండించిన రైతులతో సమీక్ష నిర్వహించారు. బసాపురం, సంతేకుడ్లూరు, పెద్దహరివాణం, చిన్నహరివాణం, చిన్న గొన్నేహాళ్ గ్రామాలకు చెందిన 68మంది రైతులు 2024-25 రబీలో 2 వేల క్వింటాళ్ల జొన్న దిగుబడి వచ్చిందన్నారు. క్వింటానికి రూ.3,371 లు చెల్లించి పౌరసరఫరాల ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించాలన్నారు.
Updated Date - May 20 , 2025 | 12:42 AM