ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వానా! నీ జాడ ఎక్కడ?

ABN, Publish Date - Jul 18 , 2025 | 12:20 AM

వర్షం జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోతుఆన్నయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

బొజ్జనాయని పేట గ్రామంలో ఎండుముఖం పట్టిన వేరుశనగ

ముందస్తుగా కురిసి, అనంతరం పత్తాలేని వానలు..

డుతున్న పంటలు, రైతు ఆశలు ఆవిరి

మద్దికెర, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వర్షం జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోతుఆన్నయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని పెరవలి, మద్దికె, ఎం.అగ్రహారం, బొమ్మనపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో మొత్తం 7,500 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. 3వేల హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో కంది, మరో 2వేల ఎకరాల్లో ఆముదం సాగు చేయగా.. 500 ఎకరాల్లో మిగిలిన ఇతర పంటలను సాగు చేశారు.

ముంచిన ముందస్తు వర్షాలు..

ఈ ఏడాది మే చివరి నెల రోహిణి కార్తెలో ముందస్తు వర్షాలు కురిశాయి. ఇంకేముంది ఏడాదంతా వర్షాలు కురుస్తాయన్న అంచనాతో రైతులు పంటలు సాగుచేశారు. తీరా నెల రోజుల నుంచి చినుకుజాడ లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి.

గాలుల ప్రభావం

వర్షాలు లేకపోగా తీవ్రంగా గాలులు వీస్తుండటంతో మొక్కలు వాడిపోతున్నాయి. కంది మొక్కలు బెట్టకు గురై ఎదుగుదల లేకుండా ఆగిపోగా, ఇక పత్తి మొక్కలు రెండు ఆకుల వరకే వచ్చి ఆగిపోయాయి. మరో వారం రోజుల్లో వర్షం రాకపోతే పంటలు ఎండిపోయే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

ఎండు ముఖం పట్టాయి

పంటలు ఎండుముఖం పట్టాయి ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాలు లేకపోవడంతో ఎండు ముఖం పట్టాయి. మరో వారంలో వర్షాలు రాకపోతే పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. - కృష్ణా యాదవ్‌, రైతు

తేమ శాతం తగ్గింది.

20 రోజులో ఎండ అధికంగా ఉండటం, గాలుల ప్రభావంతో తేమ శాతం తగ్గింది. దీంతో పంట ఎదుగుదల లేక వాడుముఖం పట్టాయి. కనీసం ఇప్పుడైనా వర్షం కురవకపోతే నష్టపోతాం. - వీరేష్‌, రైతు, మద్దికెర

Updated Date - Jul 18 , 2025 | 12:20 AM