టీడీపీ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:25 AM
రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు సాధ్యమని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ అన్నారు.
ఆలూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు సాధ్యమని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బుధవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న సుపరిపాలన అంశంపై నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం, పెన్షన్ల పెంపుదల అమలుపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం అమలు చేస్తామన్నారు. అన్నదాత సుఖీ భవ అమలు చేసి రైతులను ఆదుకుంటా మన్నారు. ఏబీసీ బ్రాంచ్ కెనాల్ అధ్యక్షుడు నగరడోణ కిష్టప్ప, వెంకన్న, అశోక్, తిప్పయ్య, అట్టేకల్ బాబు, తిప్పయ్య, మల్లప్ప, బసవరాజు, మల్లికార్జున, నరసప్ప, కొమ్ము రాజు, సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:25 AM