ఓటర్ల సమస్యలను పరిష్కరిస్తాం: ఆర్వో
ABN, Publish Date - Apr 10 , 2025 | 12:52 AM
ఓటర్ల సమస్యలను పరిష్కరిస్తామని కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కార్పొరేషన కమిషనర్ రవీంద్రబాబు అన్నారు.
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఓటర్ల సమస్యలను పరిష్కరిస్తామని కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కార్పొరేషన కమిషనర్ రవీంద్రబాబు అన్నారు. బుధవారం నగర పాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత నెలలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పురోగతిని సమావేశంలో ఆర్వో వివరించారు. వెంకటరమణ ఓటర్లు కిడ్స్ వరల్డ్ సమీపంలోని పోలింగ్ బూతలో ఉన్నట్లు, ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేంద్రం లేదంటూ గత నెల సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించారని ఆర్వో చెప్పారు. దీనిపై తగు చర్యలు చేపట్టామని, జోహరాపురం ఇందిరమ్మ కాలనీలో 969 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సమయంలో వారి కోసం అక్కడ ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వెంకటరమణ కాలనీ ఓటర్లకు పోలింగ్ కేంద్రం మార్పునకు దర ఖాస్తు ఇచ్చామని, తద్వారా వారికి సమీప పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆర్వో తెలిపారు. కార్యక్ర మంలో అసిస్టెంట్ ఆర్వో వెంకటలక్ష్మి, డిప్యూటీ ఎమ్మార్వో ధనుంజ య, సూపరింటెండెంట్ సుబ్బన్న పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 12:52 AM